శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయా ఛాంబర్ల వద్ద ఎదురు పడ్డ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురు పడ్డారు. చిరునవ్వులు చిందిస్తూ... ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. మంత్రి పదవి సాధించిన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు తమతమ ఛాంబర్‌లోకి వెళుతుండగా... ఎదురు పడ్డ ఎమ్మెల్యేలకు అభివాదం చేశారు.
అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్యెల్యేల ప్రమాణానికి వారి కుటుంబసభ్యులు, బంధువులు హాజరైయ్యారు. కొత్తగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్యెల్యేల్లో కొత్త ఉత్సాహం కనబడింది. అసెంబ్లీ లాబీలు తిరుగుతూ ఎమ్మెల్యేలు పరిశీలించారు. సభలోకి సీఎం అడుగుపెట్టగానే జై జగన్ అంటూ వైకాపా ఎమ్యెల్యేలు నినాదాలు చేశారు.