ETV Bharat / briefs

12 గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం! - taza-vayugundam

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, సాయంత్రానికి తుపానుగానూ మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా. రాయలసీమలో మాత్రం పొడి వాతారణం ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

weather
author img

By

Published : Apr 27, 2019, 11:10 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. శ్రీలంక తీరానికి దగ్గరగా తీవ్రవాయుగుండం కదులుతోంది. ట్రింకోమలీ(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయదిశగా 870 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. చెన్నైకు ఆగ్నేయదిశగా 1210 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి.... మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా 1500 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అవుతోంది. తీవ్రవాయుగుండం మరో 12 గంటల్లో తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో తీవ్రతుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని... మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది.

Intro:..

Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మేఘన ట్రావెల్స్ కు సంబంధించిన ఒక బస్సు మరమ్మతులకు గురై శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఆగిపోయింది. సుమారు ఆరు యాభై మంది ప్రయాణికులతో కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఈ బస్సు ఇంజిన్ లో డైనమో కంప్లైంట్ రావడంతో బస్సు ముందుకు కదల్లేదు. అర్ధ రాత్రి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఏసీ బస్సు కావడంతో వెంటిలేషన్ లేక ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. బస్సులో ఉండలేక రోడ్డు పైనే బైఠాయించారు. బస్సును మరమ్మతులు చేసేందుకు అర్ధరాత్రి రెండు గంటల వరకు మెకానిక్ రాకపోవడం గమనార్హం. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బస్సు రోడ్డు పైన నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బస్సు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. మధ్య రాత్రిలో బస్సు నిలిచిపోవడంతో డివైడర్ల పై సేదతీరారు. బస్సు సిబ్బంది వద్ద రిపేర్ చేయించేందుకు డబ్బులు లేక పోవడంతో ఆ డబ్బులను బస్సు లో ప్రయాణించే ప్రయాణికుల చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 8 గంటల పైగా బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులకు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో బస్సు యాజమాన్యం ఉంది. కాలం చెల్లిన బస్సు కారణంగా ప్రయాణికులు అర్ధరాత్రి నానా అవస్థలు పడ్డారు..

byte: రాత్రి 12 గంటల సమయంలో మేఘన ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. రాత్రి రెండు గంటలు అవుతున్నప్పటికీ బస్సు రిపేర్ చేయించేందుకు మెకానికల్ రాలేదు. బస్సులో ఉండలేక నానా ఇబ్బందులు పడ్డాను. రోడ్డు పైనే ఉండు పోవాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సు సిబ్బంది ఇది కనీసం మంచి నేను కూడా ప్రయాణికులకు ఇవ్వలేదు. _ knsv prasad, tanuku

byte2: బస్సు సిబ్బంది వద్ద బస్సు రిపేర్ చేయించేందుకు. డబ్బులు లేవు. ప్రయాణికులు అంతా కలుపుకొని డబ్బులు ఇస్తామని చెప్పే వరకు మెకానిక్ క్ బస్సును రిపేర్ చేసినందుకు తీసుకురాలేదు. బస్సు సిబ్బంది ప్రయాణికులకు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు.
_pp.ramayya, vallurupalli

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.