శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఆ సంఘం సభ్యురాలు లక్ష్మి ప్రధాన్ భర్త శ్రీకాంత్ ప్రధాన్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఈఈ సత్యనారాయణతో కూడిన బృందం పలు చోట్ల తనిఖీలు చేపట్టింది.
ఇవీ చదవండి