తెలుగుదేశం పార్టీపై రాష్ట్రంలోని అభిమానులే కాదు.. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు సైతం అభిమానాన్ని చాటుకుంటున్నారు. అమెరికాలోని హూస్టన్, టెక్సాస్ నగరాల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ ప్రవాసాంధ్రులు నగర వీధుల్లో కార్లతో ర్యాలీ చేపట్టారు. 2014 ఎన్నికల సమయంలోనూ తెదేపా తరఫున అమెరికాలో ప్రచారం చేశామన్నారు.
షార్లెట్ నగరంలోనూ కొందరు ప్రవాసాంధ్రులు తెదేపాకు మద్దకుగా ర్యాలీ చేశారు. తెదేపా జెండాలు చేతబూని... చంద్రబాబూ మళ్లీ నువ్వే రావాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగాలంటే.. చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని చిన్నారులు సైతం ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి....