రైలు ప్రయాణంలో సీటు కోసం తలెత్తిన తగాదా...ఒకరినొకరు గాయపరుచునే స్థాయికి చేరుకుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లేందుకు తన మిత్రుల కోసం ఓ వ్యక్తి ఎల్.టి.టి ఎక్స్ప్రెస్ రైలులో రెండు సీట్లు ఆపాడు. అదే రైలులో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి ఆ సీటులో కూర్చోన్నాడు. సీట్ల విషయంలో వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తారాస్థాయికి చేరి...ఒకరినొకరు గాయపరుచున్నారు. గొడవలో తోటి ప్రయాణికుడి చేతిని బలంగా కొరికి గాయపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండడం వలన తరచూ...ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
ఇవీ చూడండి : బియ్యపు గింజలు... అతని చేయి తాకితే కళాఖండాలు