తెలుగు రాష్ట్రాలకు చెందిన కుటుంబాక రమేష్, సురేష్, రవితేజ అనే వ్యక్తులు... 1200 కిలోమీటర్ల పాటు ప్రయాణించారు. మార్గమధ్యంలో తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెను గాలుల నుంచి కాపాడుకునేందుకు.. 2 భారీ లారీల మధ్యలో తమ కారును నడుపుతూ.. చివరికి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు. ప్రచండ తుపాను ప్రభావానికి సమాచార వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో.. హామ్ సాంకేతికతతో తమ వంతు సేవ చేశారు. ఇలా చేయడం తమకు సంతృప్తినిస్తోందని చెప్పారు. హామ్ సమాచార వ్యవస్థ.. మిగతా వ్యవస్థల కన్నా మెరుగైన ఫలితాలనిస్తోందన్నారు.
అసలేంటీ.. ఈ హామ్ కమ్యూనికేషన్స్..!
హామ్..ఓ కమ్యూనికేషన్ పరికరం.. రేడియో సిగ్నల్స్ ద్వారా ఇది పని చేస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ..అన్ని రకాల సమాచార వ్యవస్థల్లో లోపం తలెత్తినా.. ఈ సాంకేతిక వ్యవస్థతో స్పష్టంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. మిగతా సమాచార వ్యవస్థలకూ.. హామ్ కమ్యూనికేషన్కూ ఇదే ప్రధానమైన తేడా. ఏ రిలే సిస్టమ్స్ మీద హామ్ ఆధారపడదు. ఎలాంటి టవర్స్, సర్వర్స్ అవసరం లేదు. 1900వ దశకంలో మొదలైన వ్యవస్థ.. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉపయోగంలో ఉంది. ఈ విధానంలో సిగ్నల్స్ ఐనో ఆవరణం నుంచి నేరుగా వేరే స్టేషన్కు చేరుకుని సమాచారమందిస్తాయి. ప్రకృతి వైపరీత్య సమయాల్లో ఈ వ్యవస్థ మంచి ఫలితాలనిస్తుంది. పైగా.. ఎవరికీ పైసా రుసుము చెల్లించాల్సిన అవసరమూ లేదు.
ఇవీ చదవండి...ఫొనితో రైల్వేకు తీవ్ర నష్టం.. విమానయానంపైనా ప్రభావం