ETV Bharat / briefs

ఓటమి కారణాలపై నేడు తెదేపా విసృతస్థాయి సమీక్ష - చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఉన్నత స్థాయి సమీక్ష ఇవాళ జరగనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తెదేపా  శ్రేణులపై జరుగుతున్న దాడులను ఈ సమావేశంలో చంద్రబాబు..నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్తు ప్రణాళికపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఓటమి కారణాలపై తెదేపా విశ్లేషణ...నేడు విజయవాడలో సమీక్ష
author img

By

Published : Jun 14, 2019, 6:14 AM IST

విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం పార్టీ...ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తెదేపా కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను జిల్లాల వారీగా సేకరించనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్​ను తెదేపా ఏర్పాటుచేసింది. దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై అధినేత చంద్రబాబు కార్యచరణ రూపొందించనున్నారు.

ఓటమి కారణాలపై తెదేపా విశ్లేషణ...నేడు విజయవాడలో సమీక్ష

నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసే వ్యవస్థను శ్రేణులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి లేని స్థానాలు, నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి విజయాలు నమోదు చేసిన సీట్లలలో ఈసారి ఓటమి పాలవ్వడంపై వాస్తవాలేమిటనే కోణంలో అధ్యయనం చేయనున్నారు.

జన్మభూమి కమిటీల వ్యవహారం, అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అందించిన లబ్ధిని జన్మభూమి కమిటీల తీరు దెబ్బతీశాయా..తీస్తే 150 స్థానాల్లో ఆ ప్రభావం పడిందా అనే చర్చ సమావేశంలో జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్​కు పడకుండా పవన్ కల్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం..జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైకాపాకే మేలు చేసిందనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తమవుతున్నా...అది ఎన్ని స్థానాలకు పరిమితమైందో చర్చించనున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలు... గత అయిదేళ్లలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీకి అండగా నిలిచే కొన్ని సామాజిక వర్గాలను పొగొట్టుకున్నామనే భావన నేతల్లో ఉంది. వీటిపై సమీక్షలో సమగ్ర విశ్లేషణ జరగనుంది. పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించిన చంద్రబాబు...ఆ దిశగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చదవండి : ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

Intro:ap_cdp_41_13_aims lo_prathibha_av_g3
place: prodduturu
reporter: madhusudhan

ఎయిమ్స్ ఫలితాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అస్రా ఖురేషి సత్తా చాటారు ప్రొద్దుటూరు పట్టణం లోని దస్తగిరి పేటకు చెందిన జాకీర్ ఖురేషి, రుక్సానాల రెండో కుమార్తె అస్రా ఖురేషి జాతీయస్థాయిలో 461, ఓబిసి కేటగిరిలో 80 వ ర్యాంకు సాధించి భళా అనిపించుకున్నారు. ఈమె ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచారు. నీట్ లో జాతీయ స్థాయిలో 16 వ ర్యాంకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏడో తరగతి వరకు ప్రొద్దుటూరు లోనే విద్యను అభ్యసించారు పదవ తరగతి హైదరాబాదులో చదివి 10 శాతం జీపీఏ సాధించారు ఇంటర్లో బైపీసీ విభాగంలో తీసుకొని 982 మార్కులు దక్కించుకున్నారు ఎంసెట్లో రాష్ట్రస్థాయిలో 54 వ ర్యాంకు సాధించారు తాజా గా ఎయిమ్స్ లో కూడా ఉత్తమ ఫలితాలు రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.