తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు రాష్ట్రంలో అవినీతి-అభివృద్ధికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్రఅధ్యక్షుడు ఎమ్మెస్ రాజు తెలిపారు. కృష్ణా జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మట్లాడిన ఆయన.. జగన్పై విమర్శలు గుప్పించారు. సుపరిపాలన కావాలో...రౌడీయిజం కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తెదేపా అభ్యర్థులు కేఎస్ జవహర్, కేశినేని నాని తరఫున.. తిరువూరు దళితవాడల్లో ప్రచారం చేపట్టనున్నట్లుప్రకటించారు.
అధికారంలోకి రాకముందే వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా వైకాపా నేత అనిల్ కుమార్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ అధికారంలోకి వస్తే... రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తోన్న ప్రధాని మోదీ, కేసీఆర్తో జగన్ చేతులు కలపడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి :సీఎం కోసం శ్రీయాగం.. సతీమణి గో పూజ