మూడు విడతల్లో...
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 35 అసెంబ్లీ స్థానాలతోపాటు మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో
ఆశావహులకు సర్దిచెప్పిన అధినేత చంద్రబాబు.... అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా
వెల్లడించారు. 97 మంది సిట్టింగ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించారు. లోక్‌సభకు చెందిన పది మంది సిట్టింగ్‌లను తిరిగి పోటీలో నిలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 46 సీట్లు కేటాయించిన తెలుగుదేశం అధినేత... ఎస్సీఎస్టీలకు రిజర్వు చేసిన 36 సీట్లు పోను...మిగతా 93 చోట్ల ఓసీలకు అవకాశం కల్పించారు.
సిట్టింగ్‌లకే పెద్దపీట
తెలుగుదేశం పార్టీ 3 విడతల్లో 175మంది అసెంబ్లీ అభ్యర్ధులను ఖరారు చేసింది. వీరిలో 97 మంది సిట్టింగ్‌లనే కొనసాగిస్తున్నారు. 14 మంది సీనియర్ నేతల వారసుల్ని ఎన్నికల బరిలో దించుతున్నారు. మొత్తంగా 33 మందికి తొలిసారి అవకాశం ఇచ్చారు. 13 మంది సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వలేదు. చివరి జాబితాలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పతివాడ నారాయణస్వామి నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితీ గజపతిరాజును పోటీకి దించారు.
గంటా స్థానంలో సబ్బం
విశాఖ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఐదు స్థానాల్లో పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తి, మాడుగుల- రామానాయుడు, చోడవరం కేఎస్ఎన్ రాజు, భీమిలి నుంచి సబ్బం హరిని పోటీకి దింపారు. ఆయన ఇవాళో రేపో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావును ఎంపిక చేశారు.
కోస్తాలో ఆచితూచి
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావును ఖరారు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 4 పెండింగ్ స్థానాలకుగాను నిడదవోలు నుంచి శేషారావు, నర్సాపురం- మాధవ నాయుడు, పోలవరం బురగం శీను, ఉండి నుంచి రామరాజును ఎంపిక చేశారు.
తాడికొండలో మారింది సీను
గుంటూరు జిల్లాలో 3 పెండింగ్ స్థానాల్లో మాచర్ల- అంజిరెడ్డి, బాపట్ల- అన్నం సతీష్, నరసరావుపేట నుంచి అరవింద్ బాబును బరిలోకి దించారు. తాడికొండ స్థానాన్ని తొలి జాబితాలో ఎంపీ మాల్యాద్రికి కేటాయించగా మలి జాబితాలో తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌కే ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి మార్చిన చంద్రబాబు కనిగిరి నుంచి ఉగ్ర నరసింహా రెడ్డిని ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లా కావలి నుంచి కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, ఉదయగిరి- బొల్లినేని రామారావు, నెల్లూరు రూరల్- అజీజ్, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణను పోటీకి పెట్టారు.
కర్నూలులో కొత్త ముఖం
కడప జిల్లాలో 3 పెండింగ్ స్థానాల్లో కడప నుంచి అమీర్ బాబు, రైల్వే కోడూరు నర్సింహ ప్రసాద్, ప్రొద్దుటూరుకు లింగారెడ్డిని ఎంపిక చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డికి ఖరారుచేయగా, కర్నూలు అర్బన్ టీజీ వెంకటేష్ కుమారుడు భరత్, కోడుమూరు నుంచి రామాంజనేయులను పోటీకి దింపారు.
అనంత అర్బన్ ప్రభాకర్ చౌదరికే
అనంతపురంలో పెండింగ్‌లో ఉన్న 4 స్థానాల్లో కదిరి నుంచి కందికుంట ప్రసాద్, గుంతకల్లు జితేందర్ గౌడ్, కళ్యాణదుర్గం ఉమమహేశ్వరనాయుడు, శింగనమల నుంచి బండారు శ్రావణి, అనంత అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరిని ఎంపికచేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి తెర్లామ్ పూర్ణమ్, సత్యవేడు నుంచి రాజశేఖర్, తంబళ్లపల్లి శంకర్ యాదవ్, గంగాధర నెల్లూరు హరికృష్ణను పోటీకి దించారు.
యువ రక్తానికి ఎంపీ స్థానం
పార్లమెంట్ స్థానాల అభ్యర్ధుల్నీ ఖరారు చేసిన చంద్రబాబు.... శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు, విజయనగరం-అశోక్ గజపతిరాజు, అరకు కిషోర్ చంద్రదేవ్, విశాఖ నుంచి గీతం విద్యాలయాల అధినేత భరత్‌ను పోటీకి దింపారు. అనకాపల్లి- అడారి ఆనంద్, కాకినాడ- చలమలశెట్టి సునీల్, అమలాపురానికి గంటి హరీష్‌ను ఎంపిక చేశారు. రాజమహేంద్రవరం స్థానానికి మాగంటి రూపను ఖరారు చేశారు. నరసాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు, ఏలూరు-మాగంటి బాబు. విజయవాడ- కేశినేని నాని, మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ, గుంటూరు- గల్లా జయదేవ్‌ను ఎంపిక చేయగా...చర్చోపచర్చల అనంతరం నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావుకు మరోసారి అవకాశం కల్పించారు. బాపట్లకు శ్రీరాం మాల్యాద్రి., ఒంగోలు నుంచి శిద్ధా రాఘవరావుకు పోటీకి పెట్టారు. నెల్లూరు- బీదా మస్తాన్‌రావు, చిత్తూరు- శివప్రసాద్, తిరుపతి నుంచి పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. రాజంపేట- డీకే సత్యప్రభ, కడప- ఆదినారాయణ రెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్పను ఎంపిక చేయగా అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి, కర్నూలు-కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని పోటీకి దించారు.
5+4+1
మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 15 ఓసీలకు, 5బీసీలకు, 4ఎస్సీలు, ఒకటి ఎస్టీకి కేటాయించారు. భరత్, అడారి ఆనంద్, మాగంటి రూప, గంటి హరీష్, జేసి పవన్, శివానందరెడ్డి తొలిసారి బరిలోకి దిగుతున్నారు. వీరిలో నలుగురు రాజకీయ నేతల వారసులు. భరత్.... ఎంవీవీఎస్ మూర్తి, కావూరి సాంబశివరావుల మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి లోకేష్ తోడల్లుడు. మాగంటి రూప రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు. గంటి హరీష్ దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు. పవన్ రెడ్డి జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు.
తెదేపా ఎంపీ అభ్యర్థులు
లోక్‌సభ స్థానం | అభ్యర్థి పేరు |
శ్రీకాకుళం | రామ్మోహన్ నాయుడు |
విజయనగరం | అశోక్ గజపతిరాజు |
అరకు | కిషోర్ చంద్రదేవ్ |
విశాఖ | భరత్ |
అనకాపల్లి | అడారి ఆనంద్ |
కాకినాడ | చలమలశెట్టి సునీల్ |
అమలాపురం | గంటి హరీష్ |
రాజమహేంద్రవరం | మాగంటి రూప |
నరసాపురం | వేటుకూరి వెంకట శివరామరాజు |
ఏలూరు | మాగంటి బాబు |
విజయవాడ | కేశినేని నాని |
మచిలీపట్నం | కొనకళ్ల నారాయణ |
గుంటూరు | గల్లా జయదేవ్ |
నరసరావుపేట | రాయపాటి సాంబశివరావు |
బాపట్ల | శ్రీరాం మాల్యాద్రి |
ఒంగోలు | శిద్దా రాఘవరావు |
నెల్లూరు | బీదా మస్తాన్‌రావు |
చిత్తూరు | శివప్రసాద్ |
తిరుపతి | పనబాక లక్ష్మి |
రాజంపేట | డీకే సత్యప్రభ |
కడప | ఆదినారాయణ రెడ్డి |
హిందూపురం | నిమ్మల కిష్టప్ప |
అనంతపురం | జేసీ పవన్ రెడ్డి |
నంద్యాల | మాండ్ర శివానందరెడ్డి |
కర్నూలు | కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి |
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థుల తాజాజాబితా
విజయనగరం జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
నెల్లిమర్ల | పతివాడ నారాయణస్వామి |
విజయనగరం | అదితి గజపతిరాజు |
విశాఖపట్నం జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
భీమిలి | సబ్బం హరి |
గాజువాక | పల్లా శ్రీనివాసరావు |
చోడవరం | కేఎస్ఎన్ రాజు |
పెందుర్తి | బండారు సత్యనారాయణమూర్తి |
మాడుగుల | రామానాయుడు |
తూర్పుగోదావరి జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
అమలాపురం | ఆనందరావు |
పశ్చిమగోదావరి జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
నిడదవోలు | శేషారావు |
నర్సాపురం | మాధవ నాయుడు |
పోలవరం | బురగం శ్రీనివాసరావు |
ఉండి | రామరాజు |
గుంటూరు జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
తాడికొండ | తెనాలి శ్రావణ్‌కుమార్ |
మాచర్ల | అంజి రెడ్డి |
బాపట్ల | అన్నం సతీష్ ప్రభాకర్ |
నరసరావుపేట | డా. అరవింద్ బాబు |
ప్రకాశం జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
దర్శి | కదిరి బాబురావు |
కనిగిరి | ఉగ్ర నరసింహారెడ్డి |
నెల్లూరు జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
కావలి | కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి |
నెల్లూరు గ్రామీణం | అబ్దుల్ అజీజ్ |
వెంకటగిరి | కురుగొండ్ల రామకృష్ణ |
ఉదయగిరి | బొల్లినేని రామారావు |
కడప జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
కడప | అమీర్‌బాబు |
రైల్వేకోడూరు | నర్సింహప్రసాద్ |
ప్రొద్దుటూరు | లింగారెడ్డి |
కర్నూలు జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
కర్నూలు అర్బన్ | టీజీ భరత్ |
నంద్యాల | భూమా బ్రహ్మానంద రెడ్డి |
కోడుమూరు | రామాంజనేయులు (విశ్రాంత ఐఏఎస్) |
అనంతపురం జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
కదిరి | కందికుంట వెంకట ప్రసాద్ |
శింగనమల | బండారు శ్రావణి |
గుంతకల్లు | జితేందర్ గౌడ్ |
అనంత అర్బన్ | ప్రభాకర్ చౌదరి |
కల్యాణదుర్గం | ఉమామహేశ్వరనాయుడు |
చిత్తూరు జిల్లా
అసెంబ్లీ స్థానం | అభ్యర్థి పేరు |
తంబళ్లపల్లి | శంకర్ యాదవ్ |
సత్యవేడు | జేడీ రాజశేఖర్ |
పూతలపట్టు | తెర్లంపూర్ణం |
గంగాధర నెల్లూరు | హరికృష్ణ |