ETV Bharat / briefs

'వైకాపాకు సంక్షేమం కాదు.. కక్ష సాధింపే ముఖ్యం' - యనమల

సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు కన్నా ప్రతిపక్షంపై కక్ష సాధింపే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం బదులుగా ఫాసిస్ట్ ఫ్రభుత్వం నడుస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.

యనమల రామకృష్ణుడు
author img

By

Published : Jul 2, 2019, 12:42 PM IST

అభివృద్ధిని దెబ్బతీసేలా, సంక్షేమాన్ని కుంటుపరిచేలా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని యనమల ఆక్షేపించారు. ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేయడమే వైకాపా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న యనమల...నెల రోజుల్లోనే వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త పాలనను ప్రజలు చూశారన్నారు. ఈ ఖరీఫ్​లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు ఎదురైతే...ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా కసరత్తే లేదని విమర్శించారు.

ఎన్నాళ్లీ విత్తన కష్టాలు
ఖరీఫ్​ సాగుకు విత్తనాలు అందక రైతన్నలు ఆందోళనలు చేసే పరిస్థితులు వచ్చాయన్న యనమల..కనీసం విత్తన పంపిణీపై యాక్షన్ ప్లాన్ రూపొందించలేదని వ్యాఖ్యానించారు. ఎదుటివాళ్ల ఇళ్లు కూల్చేందుకే ప్రభుత్వం ఆలోచిస్తోంది తప్ప... ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. విత్తనాలకు 380 కోట్ల రూపాయలు ఇవ్వలేనివారు.. వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. 17 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన తెదేపా ప్రభుత్వంపై నిందలేయడం మాని విత్తన కొరత తీర్చాలని హితవు పలికారు.

అభివృద్ధి ఆగింది
నెలరోజుల్లో అభివృద్ధి ఇంచు కూడా కదలేదన్న యనమల...పోలవరం పనులు నిలిచిపోయాయని, మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు. పట్టిసీమకు నీళ్లు ఆపేశారన్నారు. ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత ఎంత ఉంటుందో ఊహించే పరిస్థితులు లేవన్న ఆయన...అవి జీఎస్​డీపీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయన్నారు. ఈ కారణాలతో వృద్ధిరేటు సింగిల్ డిజిట్​కు పడిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ పట్టించుకోకుండా వైకాపా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పూనుకుంటుదన్నారు. కమిటీల పేరుతో రాజధాని నగర నిర్మాణ పనులు ఆపేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి : స్పైస్​జెట్​ విమానానికి తప్పిన పెను ప్రమాదం!

Intro:యాంకర్ వాయిస్... దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామదేను పునరుత్పత్తి కేంద్రానికి నీటి ఎద్దడి పొంచి ఉంది. దేశానికి రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు గా నిలిచింది ఈ కేంద్రం ద్వారా స్వదేశీ జాతి పశువులను అభివృద్ధి చేసి రైతులకు అందించే లక్ష్యంగా నడుస్తుంది . విలువైన నాణ్యమైన స్వదేశీ జాతి పశువులను వివిధ రాష్ట్రాల నుంచి వైద్యులు అధికారులు క్షేత్రానికి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో వీటి జీవనానికి అవసరమైన తాగునీటికి సమస్య మళ్లీ తలెత్తే ప్రమాదం ఏర్పడింది .గడ్డి పెంపకం కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రతిష్టాత్మకమైన కామదేను పునరుత్పత్తి కేంద్రంలో లో త్రాగునీటి సమస్య పై ఈటివి ప్రత్యేక కథనం....
****
వాయిస్ ఓవర్ 1 ... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం లోని చింతలదేవి క్షేత్రం లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామదేను పునరుత్పత్తి కేంద్రం 2013 సంవత్సరంలో నాటి జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు ప్రారంభించాడు. ఈ కామదేను ప్రాజెక్టు పథకానికి 250 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. తొలివిడత 25 కోట్లు నిధులు మంజూరు అయినప్పటికీ ఇప్పటివరకు సుమారు 20 కోట్లు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో 17 రకాల బర్రెలు ఆవులు , క్షేత్రంలో 295 ఆవులు,118 గేదెలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి కోసం ఆ ప్రాంతంలో వేసిన బోర్లు అడుగంటాయి దీంతో పశువులకు తాగునీరు పోషణకు గడ్డి పెంచే విషయంలో లో తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి . ఈ క్షేత్రానికి తాగునీరు అందించే విషయంలో లో అధికారులు ఉప్పుటేరు వాగు నుంచి చింతలదేవి మీదగా రాళ్లపాడు జలాశయానికి ఉత్తర కాలువ ద్వారా సోమశిల జలాలను విడుదల చేస్తారు .రాళ్లపాడు ప్రాజెక్టు వెళ్లే 1.5 టీఎంసీల నీటిలో లో 7.884 ఎం సి ఇ ఎఫ్ టి అంటే సుమారు 50 ఎకరాలకు సరిపడా అంత నీటిని పైపులైన్ల ద్వారా పశువులకు నీరు ఇవ్వాలని నిర్ణయించి గత ప్రభుత్వం హయాంలో జీవో విడుదల చేశారు. ప్రస్తుతం పైప్ లైన్లు మేర పనులు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడుప్రోజెక్టు పై ప్రకాశం జిల్లా రైతులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసి ఆ పనులను నిలిపివేయాలని ధర్నా చేశారు. దీంతో పనులు కాస్త నిలిచిపోయాయి .
***
వాయిస్ ఓవర్ 2 .. ప్రస్తుతం అం కామదేను క్షేత్రంలో 17 రకాల పశువులకు సంబంధించి 370 యూనిట్లో పెంపకంలో ఉన్నాయి ఈ క్షేత్రంలో ఏర్పాటుచేసిన బోర్డు ద్వారా నీరు వీటికి సరిపోవడం లేదు వస్తున్న నీళ్లు కేవలం పశువుల అవసరాలకే సరిపోతున్నాయి గడ్డి పెంచేందుకు వీలులేకుండా పోయింది దీంతో స్థానిక రైతుల నుంచి గడ్డి పెంచి క్షేత్రానికి ఇచ్చే విధంగా అనుమతులు తీసుకువచ్చారు 100 ఎకరాల భూమిలో గడ్డి పెంచితే కానీ ఇక్కడ పశువులకు సరిపోదు ఇలాంటిది ప్రస్తుతం వస్తున్న నీటితో 14 ఎకరాల్లోనే గడ్డిని పంచడం జరుగుతుంది. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చింతలదేవి క్షేత్రానికి మీరు ఇచ్చే విషయంలో న్యాయంగా ఆలోచించాలని కొందరు రైతులు కోరుతున్నారు కామదేను పశువులకు 50 ఎకరాల్లో పంట పండించే అంత మాత్రమే తీసుకోవడం జరుగుతుందని క్షేత్రంలోని అధికారులు చెబుతున్నారు .పంటలు పండించేందుకు ఈ నీటిని తీసుకోవడం లేదని కేవలం పశువుల అవసరాలకు తాగునీటికి వినియోగించడం జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సూచనల మేరకు తమకు నష్టపరిహారం రాకున్నా తమ భూముల్లో గుండా కాలువను తవ్వేందుకు అంగీకరించామని రైతులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇరు ప్రాంతాల నాయకులు ఆలోచించి ఆగిపోయిన పైపులైన్ల పనులు కొనసాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు .
***
బైట్స్..
1. దామా మహేష్
2. బొట్లగుంట హరిబాబు .
3. మాలకొండారెడ్డి .
4. రామన్ క్షేత్ర జెడి.

Body:కామదేను క్షేత్రంలో నీటి సమస్యలు

Conclusion:యాంకర్ వాయిస్... దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామదేను పునరుత్పత్తి కేంద్రానికి నీటి ఎద్దడి పొంచి ఉంది. దేశానికి రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు గా నిలిచింది ఈ కేంద్రం ద్వారా స్వదేశీ జాతి పశువులను అభివృద్ధి చేసి రైతులకు అందించే లక్ష్యంగా నడుస్తుంది . విలువైన నాణ్యమైన స్వదేశీ జాతి పశువులను వివిధ రాష్ట్రాల నుంచి వైద్యులు అధికారులు క్షేత్రానికి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో వీటి జీవనానికి అవసరమైన తాగునీటికి సమస్య మళ్లీ తలెత్తే ప్రమాదం ఏర్పడింది .గడ్డి పెంపకం కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రతిష్టాత్మకమైన కామదేను పునరుత్పత్తి కేంద్రంలో లో త్రాగునీటి సమస్య పై ఈటివి ప్రత్యేక కథనం....
****
వాయిస్ ఓవర్ 1 ... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం లోని చింతలదేవి క్షేత్రం లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ కామదేను పునరుత్పత్తి కేంద్రం 2013 సంవత్సరంలో నాటి జాతీయ నాయకులు వెంకయ్య నాయుడు ప్రారంభించాడు. ఈ కామదేను ప్రాజెక్టు పథకానికి 250 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. తొలివిడత 25 కోట్లు నిధులు మంజూరు అయినప్పటికీ ఇప్పటివరకు సుమారు 20 కోట్లు ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో 17 రకాల బర్రెలు ఆవులు , క్షేత్రంలో 295 ఆవులు,118 గేదెలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి కోసం ఆ ప్రాంతంలో వేసిన బోర్లు అడుగంటాయి దీంతో పశువులకు తాగునీరు పోషణకు గడ్డి పెంచే విషయంలో లో తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి . ఈ క్షేత్రానికి తాగునీరు అందించే విషయంలో లో అధికారులు ఉప్పుటేరు వాగు నుంచి చింతలదేవి మీదగా రాళ్లపాడు జలాశయానికి ఉత్తర కాలువ ద్వారా సోమశిల జలాలను విడుదల చేస్తారు .రాళ్లపాడు ప్రాజెక్టు వెళ్లే 1.5 టీఎంసీల నీటిలో లో 7.884 ఎం సి ఇ ఎఫ్ టి అంటే సుమారు 50 ఎకరాలకు సరిపడా అంత నీటిని పైపులైన్ల ద్వారా పశువులకు నీరు ఇవ్వాలని నిర్ణయించి గత ప్రభుత్వం హయాంలో జీవో విడుదల చేశారు. ప్రస్తుతం పైప్ లైన్లు మేర పనులు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాళ్లపాడుప్రోజెక్టు పై ప్రకాశం జిల్లా రైతులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేసి ఆ పనులను నిలిపివేయాలని ధర్నా చేశారు. దీంతో పనులు కాస్త నిలిచిపోయాయి .
***
వాయిస్ ఓవర్ 2 .. ప్రస్తుతం అం కామదేను క్షేత్రంలో 17 రకాల పశువులకు సంబంధించి 370 యూనిట్లో పెంపకంలో ఉన్నాయి ఈ క్షేత్రంలో ఏర్పాటుచేసిన బోర్డు ద్వారా నీరు వీటికి సరిపోవడం లేదు వస్తున్న నీళ్లు కేవలం పశువుల అవసరాలకే సరిపోతున్నాయి గడ్డి పెంచేందుకు వీలులేకుండా పోయింది దీంతో స్థానిక రైతుల నుంచి గడ్డి పెంచి క్షేత్రానికి ఇచ్చే విధంగా అనుమతులు తీసుకువచ్చారు 100 ఎకరాల భూమిలో గడ్డి పెంచితే కానీ ఇక్కడ పశువులకు సరిపోదు ఇలాంటిది ప్రస్తుతం వస్తున్న నీటితో 14 ఎకరాల్లోనే గడ్డిని పంచడం జరుగుతుంది. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు తీసుకెళ్లే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చింతలదేవి క్షేత్రానికి మీరు ఇచ్చే విషయంలో న్యాయంగా ఆలోచించాలని కొందరు రైతులు కోరుతున్నారు కామదేను పశువులకు 50 ఎకరాల్లో పంట పండించే అంత మాత్రమే తీసుకోవడం జరుగుతుందని క్షేత్రంలోని అధికారులు చెబుతున్నారు .పంటలు పండించేందుకు ఈ నీటిని తీసుకోవడం లేదని కేవలం పశువుల అవసరాలకు తాగునీటికి వినియోగించడం జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు సూచనల మేరకు తమకు నష్టపరిహారం రాకున్నా తమ భూముల్లో గుండా కాలువను తవ్వేందుకు అంగీకరించామని రైతులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఇరు ప్రాంతాల నాయకులు ఆలోచించి ఆగిపోయిన పైపులైన్ల పనులు కొనసాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు .
***
బైట్స్..
1. దామా మహేష్
2. బొట్లగుంట హరిబాబు .
3. మాలకొండారెడ్డి .
4. రామన్ క్షేత్ర జెడి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.