ETV Bharat / briefs

'అవినీతి నిరూపిస్తే.. జైలుకెళ్లేందుకు సిద్ధం'

అసెంబ్లీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆత్మకూరు తెదేపా నేత కన్నబాబు అన్నారు. నీరు-చెట్టు పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే జైలుకెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

అవినీతి జరిగిందని నిరూపిస్తే...జైలుకెళ్లడానికైనా సిద్ధం : తెదేపా నేత కన్నబాబు
author img

By

Published : Jun 18, 2019, 6:05 PM IST

అవినీతి జరిగిందని నిరూపిస్తే...జైలుకెళ్లడానికైనా సిద్ధం : తెదేపా నేత కన్నబాబు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెదేపా నేత మురళి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తించిన తీరు అభ్యంతరంగా ఉందని మురళి కన్నబాబు అన్నారు. గౌరవనీయ మంత్రి పదవిలో ఉన్న ఆయన ఓ వీధి నాయకుడిలా మాట్లాడారని విమర్శించారు. కనీస అవగాహన లేని వ్యక్తికి జల వనరుల శాఖను కట్టబెట్టడం ఏమిటని అన్నారు. నీరు-చెట్టు పనుల్లో భారీ అవినీతి జరిగిందని వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే మొదటిగా నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇదీ చదవండి : కరకట్ట ఇళ్లు ఖాళీ చేయిస్తాం-ఆళ్ల రామకృష్ణారెడ్డి

Intro:రాష్ట్రంలో లో పార్టీ సిని ప్రభుత్వ విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు భవిష్యత్ ప్రణాళిక కోసం తిరుపతిలో సమావేశం.

Body:ap_tpt_39_18_apsrtc_hire_bus_association_sabha_avb_c5

రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమావేశం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దశాబ్దాలుగా ఆర్టీసీకి సేవలందిస్తున్న అద్దె బస్సుల పరిస్థితి పైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, తమ కష్టాన్ని సైతం ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఇంతకు మునుపు ఉన్న విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కొనసాగించాలని వారు కోరారు. రాష్ట్రంలో లో రెండు వేల ఎనిమిది వందల అద్దె బస్సులు ఆర్టీసీకి సేవలు అందిస్తున్నాయని........ వారికి తగిన న్యాయం చేయాలని, త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నట్లు సంఘం అధ్యక్షుడు చల్ల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు .

బైట్: అద్దె బస్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల. వెంకటేశ్వర రెడ్డి.

Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.