ఫిర్యాదు అనంతరం మాట్లాడిన నేతలు...వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా శ్రేణులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలోనూ గొడవలు పెడుతున్నారన్నారు. దుర్మార్గమైన చర్యలను ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా...తెదేపా కార్యకర్తలకు రక్షణ ఇవ్వలేమని పోలీసులు చెప్పడం దారుణమని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికీ రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేమన్న హోంమంత్రి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : విద్యుత్ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ