రాష్ట్రంలో తెదేపా నేతల మీద దాడులు.. హత్యల వరకూ వెళ్లాయి. మంగళగిరికి చెందిన తెదేపా నేత తాడిబోయిన ఉమాయాదవ్ను... గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్యచేశారు. స్థానికులు చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. పాతకక్షతోనే ఉమాయాదవ్పై దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిపై గతంలో హత్య కేసు ఉందన్న పోలీసులు.... ఉమాయాదవ్ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అనుచరుడిగా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది. శవపంచనామా కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి : ఆ జంట... దోచేయడంలో దిట్టంట!