విశాఖ జిల్లా కైలాసగిరిలో పురుషుడి పుర్రె కలకలం రేపింది. కైలాసగిరికి వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో చెట్ల పొదల్లో పుర్రె లభ్యమైన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో మొండెం కనిపించింది. ఆ ప్రాంతంలో పోలీసులకు పలు ఆధారాలు లభించాయి. చనిపోయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని 20 రోజులు గడిచి ఉంటుందని పోలీసుల అభిప్రాయ పడుతున్నారు. పుర్రె లభ్యం కావడంతో ముందుగా హత్యగా అనుమానించిన పోలీసులు... చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు ధరించిన దుస్తుల్లో దొరికిన ఆధారాలతో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి