రాష్ట్రంలో ఈరోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదవ్వొచ్చని తెలిపింది. గుంటూరు, విజయనగరం, చిత్తూరు, విశాఖ జిల్లాల్లోనూ ఇదే రీతిలో ఉండవచ్చని వెల్లడించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది.
ఇవీ చదవండి..