ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్బీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడాన్ని వ్యతిరేకించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్ధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని ఏఐఎస్బీ రాష్ట్ర కన్వీనర్ మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ :