ETV Bharat / briefs

భార్య, అత్తలపై కత్తితో దాడి చేసిన అల్లుడు

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె గొంతు కోశాడు. అడ్డొచ్చిన అత్తపైనా కత్తిదూశాడు. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా... నిందితుడు పరారీలో ఉన్నాడు.

భార్య, అత్తలపై కత్తితో దాడి చేసిన అల్లుడు
author img

By

Published : Jun 28, 2019, 6:32 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం ప్యాపర్రులో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన అత్తపైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియాంకకు తీవ్రగాయాలు కాగా... అత్త మొద్దుపాపకు గొంతుపై గాయమైంది. వీరిద్దరిని తొలుత తెనాలి ప్రభుత్వాసుపత్రికి... తర్వాత గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఆత్తారింట్లో శుక్రవారం శుభకార్యం జరగాల్సి ఉండగా... అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

అనుమానమే ఇంత పని చేసింది

రెండేళ్లుగా మదన్‌ తన భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను శారీరకంగా వేధిస్తున్నాడు. తెనాలి ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న ప్రియాంక కుటుంబ కలహాల నేపథ్యంలో మూడునెలల క్రితం తన పుట్టింటికి వచ్చేసింది. అక్కడి నుంచే ప్రియాంక తన విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో బుధవారం విధులు ముగిసిన అనంతరం ప్రియాంకను మదన్‌ బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై మళ్లీ ప్యాపర్రు గ్రామానికి తీసుకొచ్చి వదిలి పెట్టి బయటకు వెళ్లాడు. అనంతరం మధ్యాహ్నం సుమారు 12గంటల సమయంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రియాంకతో గొడవకు దిగిన మదన్..‌ తన వద్ద ఉన్న చాకుతో ఆమె గొంతు కోశాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లి పాప అక్కడికి వెళ్లి అల్లుడిని అడ్డుకోబోయింది. దీంతో అడ్డుకోబోయిన అత్తపై కూడా దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన వీరిని బంధువులు వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మదన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భార్య, అత్తలపై కత్తితో దాడి చేసిన అల్లుడు

ఇదీ చదవండీ :

చావు అంచులదాకా పోయాడు..మొత్తానికి బతికాడు

Intro:ap_cdp_16_27_moulika_vasathulu_daarunam_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటికీ మౌలిక వసతులకు నోచుకోని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బడి, గుడి లేని గ్రామం టూ ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం బడి, గుడి లేకపోవడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. కానీ అధికారులు ఎవరు ఆ గ్రామంపై దృష్టి సారించడం లేదు. ఎన్ని పార్టీలు మారిన ఎంతమంది అధికారులు మారిన వీరి పరిస్థితి మాత్రం వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది.
వాయిస్ ఓవర్:1
కడప నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు దండోరా కాలనీ. ఇక్కడ సుమారు 100 నివాసాలపై గా ఉన్నారు. అందరూ నిరుపేద కుటుంబీకులు, కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. ఈ గ్రామం ఏర్పడి 30 ఏళ్లు అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధిని నోచుకోకపోవడం దారుణం. కనీసం నడిచేందుకు కూడా సరైన దారి లేదు. రాళ్లు తేలిన రోడ్లపై నడవాల్సి వస్తుంది. మురికి కాలువలు లేకపోవడంతో నివాసాల వద్ద గుంతలు ఏర్పాటు చేసుకుని వాటిలో మురుగు నీటిని నిల్వ ఉంచారు. పందులు సంచరించడంతో లేనిపోని అనారోగ్యానికి గురవుతున్నారు. నివాసాల మధ్య ముళ్లపొదలు ఉన్నాయి. పిల్లలను బడికి పంపేందుకు పాఠశాల కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ లేకపోవడం విడ్డూరం, చివరకు ఆ గ్రామం గుడికి కూడా నోచుకోలేదు. ఎగుడు దిగుడు రోడ్లు, రోడ్లపై మురికి కుంటలు ఇలా కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు వినే నాధుడు ఎవరూ లేరంటూ వాపోయారు.
byte: రమీజా, దండోరా కాలనీ, కడప.
byte: లక్ష్మి, దండోరా కాలనీ, కడప.
byte: ముంతాజ్, దండోరా కాలనీ, కడప.
ఎండు వాయిస్ ఓవర్:
కనీస మౌలిక వసతులకు ఈ గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరం పాలకులు అధికారులు ఈ గ్రామం పై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
PTC: సుందర్, ఈటీవీ భారత్, కడప.

Body:మౌలిక వసతులు శూన్యం

Conclusion:కడప
Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.