ETV Bharat / briefs

'కుటుంబ పరిస్థితులే నా విజయానికి కారణం' - kurnool

తండ్రి పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ యువతి.. తన కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై...ఎస్సై కొలువు సాధించింది. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని బద్వేలు గ్రామీణ ఎస్సైగా నియమితులైన లలితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఎస్సై లలిత
author img

By

Published : May 21, 2019, 8:03 AM IST

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించారు లలిత. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఎస్సై కొలువు సాధించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని కడప జిల్లా బద్వేలు గ్రామీణ ఎస్సైగా నియమితులయ్యారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. అచంచల దీక్షతో ప్రభుత్వ కొలువు సాధించిన ఎస్సై లలిత..ఎందరో యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

లలిత స్వస్థలం కర్నూలు. తల్లిదండ్రులు దాసప్ప, లక్ష్మీదేవి. వీరికి ఐదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలలో రెండో సంతానం లలిత. దాసప్ప మెకానిక్ వృత్తే ఆ కుటుంబానికి ఆధారం. చాలీచాలని సంపాదనలోనూ పిల్లలందరినీ విద్యావంతులు చేశారు. తండ్రి పడుతున్న కష్టాన్ని అర్ధం చేసుకున్న లలిత.. కుటంబానికి ఆసరా నిలవాలనుకుంది. పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమై...ఎస్సై కొలువు సాధించింది.

గ్రూప్స్ సాధించాలనే లక్ష్యంతో పోటీపరీక్షలకు సన్నద్ధమైన లలితను ఎస్సై జాబ్ వరించింది. జాబ్ ఏదైనా పేద ప్రజలకు సాయపడాలనేది అంతిమ లక్ష్యంతోనే ఎస్సై వృత్తిని స్వీకరించారు. చదువుల్లో ముందుండే లలితకు పలువురు చేయూతనందించారు. వారి సాయంతోనే ఓ ప్రైవేటు అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందారు. ఈ శిక్షణతో పోటీ పరీక్షలలో విజయం సాధించి ఎస్సై కొలువును చేపట్టారు. పోలీసు స్టేషన్​కు వచ్చే ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని లలిత తెలిపారు.

ఎస్సై లలిత

ఇవీ చూడండి : ఆదివాసీ యువత అభివృద్ధే లక్ష్యంగా... శిక్షణ

Intro:ap_vzm_36_20_nmu_dharna_avb_c9 రాష్ట్ర అ రోడ్ రవాణా సంస్థ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ధర్నా కార్యక్రమం చేపట్టింది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ డిపో వద్ద అ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో లో ధర్నా నిర్వహించారు డిపో కార్యదర్శి ఏ ఎస్ టీ బాబు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెకు సమాయత్తం చేసేందుకు కార్మికులను చైతన్యపరిచేందుకు ధర్నా చేపట్టడం జరిగిందన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎరియర్స్ వెంటనే చెల్లించాలని సిబ్బంది కుదింపు చర్యలు మానుకోవాలని వస్తువులు కొనేందుకు ప్రతియేటా బడ్జెట్లో లో వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు యూనియన్ నాయకులు కార్మికులు నినాదాలు చేశారు

Conclusion:డిపో గేటు వద్ద అ ధర్నా చేస్తున్న కార్మికులు నినాదాలు ఇస్తున్న కార్మికులు జెండాలతో నిరసన తెలుపుతున్న కార్మికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.