ETV Bharat / briefs

శేషాచలంలో కార్చిచ్చు... వందల హెక్టార్లు అగ్నికి ఆహుతి - శేషాచలం

శేషాచలం కొండల్లోని అటవీ ప్రాంతం మంటల్లో దగ్ధమవుతోంది. గత రెండు రోజులుగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తోంది. ఈ మంటల్లో వందల హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది.

శేషాచలంలో కార్చిచ్చు
author img

By

Published : Apr 15, 2019, 9:22 PM IST

శేషాచలంలో కార్చిచ్చు

తిరుమల శేషాచలం కొండల్లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. కుమారధార, పసుపుధార జలాశయాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు... బలమైన గాలులు వీస్తుండడం వలన అగ్నికీలలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ధర్మగిరి వేద పాఠశాల వైపుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించటం వలన అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలులేకపోయిందని సిబ్బంది తెలిపారు. చెట్ల కొమ్మలతోనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. 10 రోజుల క్రితం గండికోన, చామలకోన ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించి వందల ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది.

ఇవీ చూడండి : వీవీ ప్యాట్​ స్లిప్పులు దొరకటంపై స్పందించిన ద్వివేది

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.