ఓట్ల లెక్కింపులో వైకాపా గాలి బలంగా వీస్తోంది. వైకాపా అభ్యర్థులు ఆధిక్యంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు, వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామరెడ్డి నేతృత్వంలో ఉద్యోగులంతా సచివాలయం గేటు బయట ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆకాక్షించాయి. సీపీఎస్ రద్దుతో పాటు మధ్యంతర భృతిని 27 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.
వైకాపా ఆధిక్యం.. సచివాలయం వద్ద ఉద్యోగ సంఘాల సంబరాలు - వైకాపా
రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించే దిశగా కొనసాగుతుంది. వైకాపా అభ్యర్థుల 140 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. వైకాపా ఆధిక్యంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగ సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి వైకాపాకు మద్దతు ప్రకటించారు