వేసవి సెలవులకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద సందడి నెలకొంది. ఎండల తీవ్ర ఇంకా ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈనెల 15వరకు ఒంటిపూటే తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈసారి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొన్ని సర్కారు బడుల్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు ఉచితంగా అందిస్తున్నా... భవనాల కొరత తీవ్రంగా ఉంది. చాలా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని 582 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీగోడ లేదు. 706 తరగతి గదులు శిథిలావస్థకు చేరినవే ఉన్నాయి. 105 పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు సందడి చేశారు. చాలా రోజుల తరువాత తమ స్నేహితులను కలుసుకున్న ఆనందంలో విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకున్నారు. పలు పాఠశాలల్లో మాత్రం సమస్యలే స్వాగతం పలికాయి.
వేసవి సెలవులకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద సందడి నెలకొంది. ఎండల తీవ్ర ఇంకా ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈనెల 15వరకు ఒంటిపూటే తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈసారి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొన్ని సర్కారు బడుల్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు ఉచితంగా అందిస్తున్నా... భవనాల కొరత తీవ్రంగా ఉంది. చాలా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కడప జిల్లాలోని 582 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీగోడ లేదు. 706 తరగతి గదులు శిథిలావస్థకు చేరినవే ఉన్నాయి. 105 పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
ప్రజలకు స్వచ్ఛమైన న్యాయ సేవలను అందించాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. కడప రైల్వే స్టేషన్లో లో ఏర్పాటు చేసిన రైల్వే కోర్టును ఆయన ప్రారంభించారు. రైల్వే సిబ్బంది తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే శాఖని చెప్పారు. కావున ప్రపంచ దేశాలనుంచి ఎంతో మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారని వారందరికీ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. న్యాయ శాఖ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
Body:రైల్వే కోర్టు ప్రారంభం
Conclusion:కడప