ETV Bharat / briefs

అదుపు తప్పిన స్కూల్​ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

విజయవాడలోని ఏలూరు రోడ్డు వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఫుట్​పాత్​పై నడుస్తున్న పాదచారునికి స్వల్ప గాయాలైనాయి.

ఏలూరు రోడ్డు వద్ద బస్సు ప్రమాదం
author img

By

Published : Jun 29, 2019, 11:55 AM IST

ఏలూరు రోడ్డు వద్ద బస్సు ప్రమాదం

విజయవాడ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ఏలూరు రోడ్డు మమతా హోటల్ వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి ఆగివున్న కారును ఢీ కొట్టింది. కారు, స్కూల్ బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్​కు ఫిట్స్ రావడంతో బస్సు పక్కకు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు పక్కన ఫుట్​పాత్​పై నడుస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గవర్నర్​పేట ట్రాఫిక్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ :

'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'

Intro:వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.

Body:వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామం వద్ద NH 44 జాతీయ రహదారిపై బస్సు బోల్తా . కాచిగూడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కడప నుండి హైదరాబాద్ కు రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరింది . కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం దగ్గరకు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది .ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. రెస్ట్ డ్రైవర్ అమరేందర్ రెడ్డి కథనం ప్రకారం బస్సు లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు, డ్రైవర్ కి గాయాలయ్యాయని తెలిపారు.
వనపర్తి డిపో మేనేజర్ గారి కథనం ప్రకారం బస్సు అదుపు తప్పి రోడ్డు దిగి రెండు పల్టీలు కొట్టిందని దాంట్లో ప్రయాణిస్తున్న నిర్మల్ కి చెందిన దస్తగిరి అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలియజేశారు .అతడిని హైదరాబాదు ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు .డ్రైవర్ రవీందర్ ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రయానికులు జయరామయ్య ,సహదేవ్ రెడ్డి లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ప్రయాణికులందరినీ మరొక బస్సులో హైద్రాబాద్ కి తరలించామని ఆయన తెలియజేశారు.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.