భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో సగటున 45 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ..తీవ్రత ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. మరో రెండు రోజుల పాటు వడగాలులతో కూడిన ఎండలుంటాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. వాతవరణంలో తేమ శాతం తగ్గిందని వివరించింది. ఆరుబయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇవీ చదవండి..కంటి చూపు 20 శాతం... మార్కులు 90 శాతం