ETV Bharat / briefs

పార్వతీపురంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురికి తీవ్రగాయాలు

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్​లోని తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ - వ్యాను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

పార్వతీపురంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 15, 2019, 9:23 PM IST

పార్వతీపురంలో రోడ్డు ప్రమాదం.

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్​లోని తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చినమేరంగి నుంచి తోటపల్లి బైక్​పై వస్తోన్న వారిని ఎదురుగా వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోటపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, హరీష్, ఆర్.లోకేశ్ గాయపడ్డారు. క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై గరుగుబిల్లి మండల పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి : బీరు బాటిల్​లో తేలు.. తాగితే పోయేవి ప్రాణాలు..

Intro:AP_RJY_56_15_VENKANNA_RADHOTSAVAM_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

కోరిన కోరికలు తీర్చే దేవుడిగా కోనసీమ తిరుపతి గా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో భాగంగా రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు

Body:స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచారు రధాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు అనంతరం పూజ నిర్వహించి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రధాన్ని లాగారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగింది

Conclusion:వాడపల్లి రథోత్సవానికి ఒక చరిత్ర కూడా ఉంది.1931వ సంవత్సరంలో లో రథోత్సవం నిర్వహిస్తుండగా రథంపై గాంధీ చిత్రపటం జాతీయ జెండాను బ్రిటిష్ పాలకులు తొలగించడంతో వారిని ఎదిరించినందుకు పలువురు తుపాకీ తోటలకు అసువులు బాసారు అప్పట్నుంచే ఆగిపోయిన రథోత్సవం రెండేళ్ల నుంచి తిరిగి ప్రారంభమైంది ఈ రథాన్ని లాగేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వెళ్లి వచ్చారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.