కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మద్దికేరలో ప్రజలకు మంచినీటి సరఫరాను అందించేందుకు రెండు ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సర్పంచ్ అర్ధగిరి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అమెరికాలో వైద్య వృత్తిలో స్థిర పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన సీతారామిరెడ్డి గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలను అందించారు. తన ప్రతినిధులుగా కొనసాగుతున్న మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్లు తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీటి సమస్య తీరే దాకా ట్యాంకర్లతో నీటి సరఫరా చేపడతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ :