కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న ఆర్డీవో ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల్లో చేర్పిస్తున్న రోజుల్లో...ముఖ్యమైన ప్రభుత్వ శాఖలో పనిచేస్తోన్న ఓ అధికారి తన కుమారుడుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్పూర్తిదాయకంగా నిలిచారు. గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తోన్న చెరుకూరి రంగయ్య తన కుమారుడు సిద్ధార్థను కొత్తపేటలోని రవి రంగయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్చారు.
విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడమే కాకుండా తాను ఆచరించి చూపారు ఆర్డీవో రంగయ్య. ప్రభుత్వ పాఠశాలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలిగించడానికే తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడిందని...ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్నాయన్నారు.
ఇదీ చదవండి : రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్