ETV Bharat / briefs

ఎవరేంటో... మే 23న తెలుస్తుంది: ఎమ్మెల్సీ డొక్కా - jagan

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వైకాపా... తమకేం తెలియదంటూ ఈవీఎంల భద్రతపై గవర్నర్​కు ఫిర్యాదు చేయడం జగన్ ఆడుతున్న ఓ కపట నాటకమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గవర్నర్‌కు జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
author img

By

Published : Apr 16, 2019, 6:00 PM IST

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్

రాష్ట్రంలో తెదేపా నేతలపై జరిగే దాడులు ఎన్నికల సంఘానికి కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ, జగన్​ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. జగన్, విజయసాయిరెడ్డి... ఈసీని పొగిడేందుకు పోటీ పడుతున్నారని డొక్కా అన్నారు. ఈవీఎంలు పని చేయకుండా మొరాయిస్తే.. ప్రజలు పడ్డ ఇబ్బందులు వైకాపాకు కన్పించలేదా అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష వైకాపా చేసే ఫిర్యాదులకు మాత్రమే ఎన్నికల సంఘం స్పందిస్తుంది తప్పా తెదేపా ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. ఈసీ పక్షపాత ధోరణికి ఇదే నిదర్శనమన్నారు. తెదేపా ఈవీఎం నిపుణులు హరిప్రసాద్​పై ఉన్న కేసుకు అభ్యతరం చెప్పిన ఈసీకి... వైకాపా చేస్తున్న దాడులు కన్పించడం లేదా అన్నారు.

50శాతం వీవీ ప్యాట్ స్లిపులు లెక్కించడానికి ఈసీకి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. మే 23న ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది తెలిసిపోతుందన్న డొక్కా.... వీవీఫ్యాట్ స్లిపులు లెక్కించే వరకు చంద్రబాబు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : గవర్నర్ నరసింహన్​తో వైఎస్ జగన్ సమావేశం

Intro:ap_rjy_38_16_poling_staf_training_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు

Conclusion:కేంద్రపాలిత పుదుచ్చేరి రాష్ట్ర పార్లమెంట్ స్థానానికి రెండవ దశలో ఈనెల 18న న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గమైన యానంలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పుదుచ్చేరి నుండి వచ్చిన 36 మంది ప్రెసిడెంట్ ఆఫీసర్లకు యానంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు అసిస్టెంట్ ప్రెస్సింగ్ ఆఫీసర్లుగా నియమితులైన వారికి యానం నియోజవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా ఎన్నికల పర్యవేక్షకులు రుద్ర గౌడ పలు సూచనలు చేశారు ప్రశాంతంగా తొందరపాటు లేకుండా ఎన్నికలు సజావుగా సాగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.