ETV Bharat / briefs

"కరెంట్ లేదు... తాగునీరు రాదు.. ఇంకెంతకాలమీ వ్యథ" - west godavari

"కరెంట్ లేదు... తాగునీరు రాదు... ఏళ్ల తరబడి ఇలానే బతుకుతున్నాం. ఇకెంతకాలం ఇలా కాలం వెళ్లదీయాలి. ఇకనైనా మా వ్యథను ఆలకించండి.." సీతంపేట వాసులు వేడుకుంటున్నారు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు.

మంచినీరు కరెంటు లేక సీతంపేట గ్రామం విలవిల
author img

By

Published : Jul 1, 2019, 11:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సీతంపేట గ్రామంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన కాలనీలో గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని... అక్కడ తాగునీరు, విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడితే ప్రాంతమంతా అంధకారమై బిక్కుబిక్కుమంటూ రావాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. తమ పిల్లలు బయటకి వస్తే పాములు, పురుగులు కుట్టి ఆసుపత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ప్రజా ప్రతినిధులు హామీలిస్తున్నారే తప్ప... సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తమ గోడు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఏలూరు కలెక్టరేట్​ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు.

ఇదీ చదవండీ... రైతుల నగదు చెల్లింపులో జాప్యం తగదు: పవన్

Intro:Ap_vsp_46_Ntr_hospital_mla_samiksa_ab_AP10077_k.bhanojirao_anakapall
ప్రజల మన్ననలు పొందేలా వైద్య సేవలు అందించాలని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ సూచించారు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా కానున్న నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కడే వైద్య సేవలు అందించాలన్నారు గతంలో విశాఖపట్నం కెజిహెచ్ కి రోగులు తరలించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని సిబ్బందికి సూచించారు ఆసుపత్రిలో కావలసిన సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరతను తిరుస్తామని తెలిపారు. విభాగాల వారీగా కావలసిన సదుపాయాలు పై తనకు నివేదిక అందజేస్తాం సమస్యలు పరిష్కరించేలా వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు.

Body:అనకాపల్లి ఆస్పత్రికి వచ్చే రోగులందరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ జగన్మోహన్ రావు వైద్య సిబ్బంది ఎమ్మెల్యేని సత్కరించారు అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డు లను ఎమ్మెల్యే అమర్నాథ్ పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు

Conclusion:గుడివాడ అమరనాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.