ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. జులై 1 నుంచి 'ప్రజాదర్బార్' ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ప్రతిరోజూ గంటపాటు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ప్రజాదర్బార్ నిర్వహణకు సీఎం కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల స్వీకరణకు 'స్పందన' కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 1 నుంచి స్పందన కార్యక్రమం ద్వారా వినతుల స్వీకరణకు కలెక్టర్లు ఏర్పాట్లు ప్రారంభించారు.