ETV Bharat / briefs

బీర్లకు పోలీసుల కాపలా..!

హైదరాబాద్​ బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా పడింది. రహదారిపై 17వందలకు పైగా  ఉన్న బీర్ కాటన్లు చోరీ కాకుండా పోలీసులు కాపలా కాశారు.

author img

By

Published : May 27, 2019, 12:11 PM IST

బీర్లకు పోలీసుల కాపలా..
హైదరాబాద్​లో బీరు సీసాల లారీ బోల్తా

హైదరాబాద్ బేగంపేటలో‌ బీరుసీసాల లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సంగారెడ్డి నుంచి ఉప్పల్​కు వెళ్తున్న వాహనం బేగంపేట్ వద్ద నడిరోడ్డుపై బోల్తా పడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పిల్లర్ 30 వద్ద అదుపుతప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించారు. స్వల్ప గాయాలైన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. 17వందలకు పైగా పడివున్న బీర్ కాటన్లు చోరీ కాకుండా పోలీసులు పహారా కాశారు. అనంతరం బీర్లను వేరే వాహనంలో రవాణా చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.