అనాథ శవంగా పరిగణించిన పోలీసులు వివరాల కోసం అతడు ఉంటున్న గదిని పరిశీలించారు. గదిని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. యాచకుని వివరాలు దొరకలేదు కానీ అక్షరాలా రూ. 3 లక్షల 22 వేల 672 నగదు పోలీసులకు లభ్యమైంది. ఈ దృశ్యాన్ని చూసి పోలీసులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మొత్తం సమాచారాన్ని పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నిత్యం యాచన చేస్తూ.. ఇంత డబ్బు పోగుచేసిన బషీర్ సాహెబ్ అనాథగా మృతి చెందడంపై గుంతకల్లు వాసుల మనస్సును కలిచివేసింది.
ఇదీ చూడండి : ట్వీట్ వార్: మీరే తుగ్లక్.. కాదు మీరే తుగ్లక్