ETV Bharat / briefs

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడ్డ దివ్యాంగ ఓటర్లు - ap general eletions

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 11 తేదీన నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో 3 లక్షల దివ్యాంగ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. దివ్యాంగులు ఓటు శాతాన్ని పెంచేందుకు ఈసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని అన్నారు. ప్రతీ ఓటరు తమ హక్కు వినియోగించుకునేలా ప్రయత్నించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడ్డ దివ్యాంగ ఓటర్లు
author img

By

Published : Apr 20, 2019, 1:22 PM IST

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 21 వేల దివ్యాంగ ఓటర్లు ఉంటే... అందులో 3 లక్షలకు 37 వేల 259 ఓటర్లు ఈవీఎంలలో తమ ఓటును నిక్షిప్తం చేశారు. దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ ముందుగానే కసరత్తు చేసింది. జిల్లాల వారీగా దివ్యాంగ ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేసింది. మొత్తం దివ్యాంగుల్లో సుమారు 65శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. దివ్యాంగ ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలిరావడం చాలా మందికి స్ఫూర్తి నిచ్చిందని ద్వివేది వెల్లడించారు.

జిల్లాల వారీగా...

శ్రీకాకుళం నుంచి 91.11% మంది దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా విజయనగరంలో 47.23% మంది ఓటు వేశారు.

జిల్లాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగులు

జిల్లా మొత్తం ఓటర్లు ఓటు వేసిన వారు నమోదు శాతం
అనంతపురం 44,115 28,192 63.90 %
గుంటూరు 40,921 26,552 64.88 %
ప్రకాశం 35,833 26,467 73.86%
నెల్లూరు 35,247 25,469 72.25 %
విజయనగరం 36,418 17,201 47.23%
విశాఖపట్నం 44,163 25,116 56.87%
తూర్పుగోదావరి 55,732 29,609 53.12%
పశ్చిమగోదావరి 44,010 28,917 65.70%
కృష్ణా 36,945 24,849 67.25%
కర్నూలు 39,977 29,012 72.57%
చిత్తూరు 50,965 38,121 74.79%
శ్రీకాకుళం 29,787 27,140 91.11%
కడప 26,916 20,344 75.95%

ప్రత్యేక ఏర్పాట్లు

రాష్ట్రంలో ఉన్న వివిధ కేటగిరిల చెందిన దివ్యాంగ ఓటర్లను గుర్తించేందుకు రాష్ట్రవికలాంగ సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకుంటూ మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఈసీ తెలిపింది. దృష్టి లోపం గల దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో అభ్యర్థుల పేర్లు లిఖించారు. ఇలా చేయడం వలన దృష్టి లోపం ఉన్న వారు సులభంగా ఓట్లు వెయ్యగలిగారని ద్వివేది అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు, వీల్​ఛైర్స్ అందుబాటులో ఉంచి సహకరించామన్నారు. ఓటు వేసేందుకు దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాల ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించామన్నారు. దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరగడం... మంచి పరిణామమని ఈసీ అభిప్రాయపడింది.

Intro:ap_atp_57_20_cm birth day_avb_c10
date:20-04-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
అనంతపురం జిల్లా పెనుకొండ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 69వ పుట్టినరోజులు వేడుకలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెనుగొండ లోని పెట్రోల్ బంక్ ఆవరణంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్ లు పండ్లు పంచిపెట్టారు కార్యక్రమంలో లో తెలుగు యువత జిల్లా కార్యదర్శి బాబుల్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బైట్:సవిత , రాష్ట్ర కురుబ కార్పరేషన్ చైర్మన్

Body:ap_atp_57_20_cm birth day_avb_c10

Conclusion:9100020922

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.