ETV Bharat / briefs

ట్రైన్ మాక్స్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

ట్రైన్ మాక్స్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వ నిలుపుదల చేయడానికి నిరాకరించింది. ఏదానా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తే అప్పుడు సవాలు చేసే వీలుందని ట్రైమాక్స్​ సంస్థకు వెసులుబాటు ఇచ్చింది.

author img

By

Published : Jun 14, 2019, 8:18 AM IST

ట్రైన్ మాక్స్ సంస్థకు హైకోర్టులో చుక్కెదురు

శ్రీకాకుళం జిల్లాలో బీచ్ శాండ్ ఖనిజం తవ్వకాల విషయమై గతంలో ఇచ్చిన అనుమతిలోని కొంత విస్తీర్ణానికి... కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉపసంహరించుకోవడాని సవాలు చేస్తూ ట్రైన్ మాక్స్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది. కేంద్ర ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులను సవాలు చేసుకోవడానికి ట్రైమాక్స్ సంస్థకు వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఏం. సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ట్రైమాక్స్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అనుమతులు ఉపసంహరించుకునే ముందు కేంద్ర ప్రభుత్వం తమకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ బీచ్ శాండ్​ను శాస్త్రీయ పరిశోధనకు,రక్షణ అవసరాలకు వినియోగిస్తారు. వ్యాపార అవసరాలకు వినియోగానికి ఇచ్చిన లీజులు రద్దు అవుతాయన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేయడానికి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే సవాల్ చేసుకోవడానికి ట్రైమాక్స్ సంస్థకు వీలు కల్పించింది.

ఇదీ చదవండీ :

'శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తా'

Intro:ap_cdp_41_13_aims lo_prathibha_av_g3
place: prodduturu
reporter: madhusudhan

ఎయిమ్స్ ఫలితాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అస్రా ఖురేషి సత్తా చాటారు ప్రొద్దుటూరు పట్టణం లోని దస్తగిరి పేటకు చెందిన జాకీర్ ఖురేషి, రుక్సానాల రెండో కుమార్తె అస్రా ఖురేషి జాతీయస్థాయిలో 461, ఓబిసి కేటగిరిలో 80 వ ర్యాంకు సాధించి భళా అనిపించుకున్నారు. ఈమె ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచారు. నీట్ లో జాతీయ స్థాయిలో 16 వ ర్యాంకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఏడో తరగతి వరకు ప్రొద్దుటూరు లోనే విద్యను అభ్యసించారు పదవ తరగతి హైదరాబాదులో చదివి 10 శాతం జీపీఏ సాధించారు ఇంటర్లో బైపీసీ విభాగంలో తీసుకొని 982 మార్కులు దక్కించుకున్నారు ఎంసెట్లో రాష్ట్రస్థాయిలో 54 వ ర్యాంకు సాధించారు తాజా గా ఎయిమ్స్ లో కూడా ఉత్తమ ఫలితాలు రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.