ETV Bharat / briefs

కులాంతర వివాహం.. యువకుడిని చితకబాదిన బంధువులు - love marriage

కులాంతర వివాహం చేసుకుని నాలుగేళ్లయింది... ఉన్న ఊరు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లి హాయిగా బతుకుతున్నారు. అయితే ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చిన యువకుడిని... బంధువులు చెట్టుకు కట్టేసి కొట్టారు. యువకుడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

యువకుడ్ని చెట్టుకు కట్టి కొట్టిన బంధువులు
author img

By

Published : Apr 17, 2019, 6:17 PM IST

యువకుడ్ని చెట్టుకు కట్టి కొట్టిన బంధువులు

ప్రకాశం జిల్లా దర్శి మండలం సాయినగర్​లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

సాయినగర్​కు చెందిన మహమ్మద్ రఫీ.. వేరే కులానికి చెందిన యువతిని 4 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఊరు నుంచి వెళ్లిపోయి తిరుపతిలో కాపురముంటున్నారు. అయితే ఈ మధ్య ఓటు వేసేందుకు పట్టణానికి వచ్చిన రఫీని... ఆయన కుటుంబసభ్యులు తీవ్రంగా దూషించారు. తీవ్ర కోపానికి గురైన రఫీ బాబాయి షేక్ ఖాసిం, షేక్ బాజీ, కుటుంబ సభ్యులు అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడనుంచి తప్పించుకున్న రఫీ... స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగుచూసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు దర్శి ఎస్.ఐ శశికుమార్ తెలిపారు.

ఇవీ చూడండి : తిరుమలలో.. కళియుగ దైవానికి వసంతోత్సవాలు

Intro:ap_knl_14_17_hospital_sanitetion_.bad_bytes_pkg_c1

Body:ap_knl_14_17_hospital_sanitetion_.bad_bytes_pkg_c1

Conclusion:ap_knl_14_17_hospital_sanitetion_.bad_bytes_pkg_c1
note....స్క్రిప్ట్ ftp లో పంపాను సార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.