చీరాలను జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని అర్హతులు ఉన్నాయని ప్రకాశం జిల్లా చీరాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పోలవరపు ప్రసాద్ అన్నారు. దీనికోసం లక్ష సంతకాల సేకరణను గడియార స్తంభం కూడలిలో జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రం విభజన జరిగినప్పుడూ చీరాలకు అన్యాయం జరిగిందని జిల్లా సాధన ఐకాస కమిటీ సమన్వయకర్త తాడివలస దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో లక్ష మంది చేత సంతకాలు చేయించి ముఖ్యమంత్రి జగన్ను కలిసి చీరాల ప్రాంత అభిప్రాయాలను తెలియజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... 'బాబర్... కోహ్లీ స్థాయిని అందుకుంటాడు'