కడప జిల్లాలోని కొనసముద్రం గ్రామంలో మూడు వేల పైచిలుకు జనాభా ఉన్నారు 1953లో ఓ మిషనరీ సంస్థ ఈ పాఠశాలను నెలకొల్పింది. విద్యాభివృద్ధికి కృషి చేసింది. తర్వాత ఎవరూ పట్టించుకోని కారణంగా అసౌకర్యాలకు నిలయమైంది. కంపచెట్ల మధ్య విష జంతువులతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. ఈ పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.
200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 22 మందే..
ఒకప్పుడు ఈ బడిలో 200 మందికి పైగా చదివారు. కాలక్రమంలో.. ప్రాభవం కోల్పోయిన కారణంగా.. విద్యార్థుల సంఖ్య 22కు పడిపోయింది. మిషనరీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వమైనా బాధ్యత తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దెబ్బతిన్న భవనం
ఈ స్కూలు భవనం షెడ్ల పైకప్పు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే కురుస్తుంది. తాగునీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో ముళ్ళపొదలు విస్తరించాయి. ప్రహరీ లేదు. విష జంతువుల బెడద అధికంగా ఉంది .గతంలో ఓ విద్యార్థికి తేలు కుట్టింది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి చికిత్స పొంది గట్టెక్కారు. తరగతి గదులు పూర్తి దెబ్బతిన్నాయి. కిటికీలు, వాటి తలుపుల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక ప్రధానోపాధ్యాయు డు ఇద్దరు సహో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా నా ఈ పాఠశాలను బాగు చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.