వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష(నీట్)లో ఆంధ్రప్రదేశ్ నుంచి అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితా అనుగుణంగా విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల మేరకు ప్రతిభావంతుల జాబితాను రూపొందిస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తెలిపింది. విద్యార్థుల జాబితాను సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ విడుదల చేశారు. తొలివిడత కౌన్సిలింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా లేకుండా పూర్వ పద్ధతిలో సీట్ల భర్తీ చేపట్టనుంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్పై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని విశ్వవిద్యాలయం కోరింది. గత ఏడాది యాజమాన్య కోటా సీట్లు ఆన్లైన్ ద్వారా పూర్తి చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఆర్వీఎస్ వైద్య కళాశాల విద్యార్థులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటన జారీ చేస్తామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి సీవీ రావు తెలిపారు.
ఇదీ చదవండి : నేను రాలేను... మీరే రండి: మెహుల్ చోక్సీ