నేడు పార్లమెంటులో 'అటల్ జీ'చిత్తరువు ఆవిష్కరణ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని, భాజపా దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయీ నిలువెత్తు చిత్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.
వాజ్పేయీ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగారు. 1996లో మొట్టమొదటి సారి ప్రధాని పదవి చేపట్టి 13 రోజులు అధికారంలో ఉన్నారు. రెండోసారి 1998-1999 మధ్య 13 నెలలపాటు, మూడోసారి 1999 నుంచి 2004 వరకు ప్రధాని పదవిలో కొనసాగారు.
సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడిన ఆయన గతేడాది ఆగస్టు 16న కన్నుమూశారు.