ETV Bharat / briefs

అమీర్​పేట టు హైటెక్​సిటీ మెట్రో సర్వీస్ నేటి నుంచే...

హైదరాబాద్‌వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గవర్నర్ నరసింహన్​ అమీర్​పేటలో జెండా ఊపి సేవలు ప్రారంభిస్తారు. మొత్తం 56 కిలోమీటర్లతో మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

నేడే అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో ప్రారంభం
author img

By

Published : Mar 20, 2019, 8:51 AM IST

నేడే అమీర్​పేట- హైటెక్​సిటీ మెట్రో ప్రారంభం
నేటి నుంచి అమీర్​పేట నుంచి హైటెక్​సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు అమీర్​పేట స్టేషన్​లో గవర్నర్ నరసింహన్​ జెండా ఊపి మెట్రో సేవలు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణ సేవలు అందించనున్నారు.

10 కిలోమీటర్ల దూరం:

ఈ మార్గంలోని రైళ్లు అమీర్​పేట నుంచి మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈ రెండు స్టేషన్​ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

9 నుంచి 12 నిమిషాల మధ్య:

అమీర్​పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తైన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్​బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్​పేట్​లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

56 కిలోమీటర్ల మెట్రో మార్గం:

హైదరాబాద్​లో 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్- ఎల్​బీనగర్, 17 కిలోమీటర్ల నాగోల్- అమీర్​పేట మార్గాల్లో ఇప్పటికే మొదలయ్యాయి.10 కిలోమీటర్ల అమీర్‌పేట- హైటెక్​సిటీ మార్గంలో సేవలు ప్రారంభమైతేమొత్తం 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి రాబోతుంది.

Intro:TG_ADB_32_19_CHALIVENDRAM_AV_G1
చలివేంద్రం ప్రారంభం..
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగనఁ వద్ద ఒరుగంటి ప్రకాష్ తండ్రి నర్సింలు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చాలివేంద్రాన్ని సిఐ రమేష్ బాబు ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చాలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇలాంటి సేవకార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.