అమర్ కంటక్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీతో కలిసి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని వీసీ నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుల సమర్పణకు మే 16 చివరి తేదీగా నిర్ణయించామన్నారు. అలాగే మే 24 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని.. జూన్ 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పీజీ కోర్సులకు 20 సీట్లు, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 30 మంది విద్యార్థులను తీసుకుంటామని తెలిపారు. ఇవి కాకుండా ఉపాధి శిక్షణ సర్టిఫికెట్ కోర్సులు కూడా నిర్వహించి ..శిక్షణ తరువాత వారికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు ప్రారంభింపచేసే దిశగా తాము ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి: