తిరుపతిలో భాజపా ప్రజా ధన్యవాద సభకు ప్రధాని హాజరయ్యారు. మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, స్వాగతం పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్..ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బహిరంగ సభకు చేరుకున్న మోదీ..నమో వెంకటేశాయా అనే స్తోత్రంతో ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఏపీలో ఘన విజయం సాధించిన జగన్కు అభినందనలు. సుపరిపాలన అందించాలని జగన్‌ను కోరుతున్నా. ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన ఏపీ, తమిళనాడు ప్రజలకు అభినందనలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో ముందుంది. ఏపీ ప్రజల్లో ప్రతిభా పాటవాలకు కొదవలేదు. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది. మా ప్రభుత్వంపై దేశ ప్రజల ఆకాంక్షలు పెరిగాయి. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
---తిరుపతి ప్రజా ధన్యవాద సభలో మోదీ.
ఇవీ చదవండి...భాజపాతో జేడీయూ కటీఫ్- బిహార్లో తప్ప!