తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ పలు కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేస్తే.... వివరణతీసుకోకుండా అధికారులపై ఎలా చర్యలు తీసుకుంటారని లంకా దినకర్ ప్రశ్నించారు.ఫారం-7 కింద దరఖాస్తులు పెట్టింది తామేనని బహిరంగసభలో జగన్ ఒప్పుకున్నా...నకిలీ ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నిజాయతీగా పనిచేస్తున్న అధికారులను వైకాపా నేతలు చెప్పారని బదిలీలు చేయిస్తారా అని దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై సిట్ నివేదిక వెలువడే సమయంలో అధికారి బదిలీ సబబేనా అని లంకా దినకర్ ఎన్నికల సంఘాన్ని అడిగారు. భాజపా పాలిత జార్ఖండ్‌లో ఇంటెలిజెన్స్ డీజీ... ఎమ్మెల్యేల కొనుగోలులో పట్టుబడినా చర్యల్లేవు అని గుర్తు చేసిన దినకర్..ఈసీ స్వతంత్రంగా పనిచేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి:'జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయండి'