పెనుకొండ శాసనసభ్యుడు మాలగుండ్ల శంకర్ నారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జిల్లా నుంచి ఆయన ఒక్కరికే మంత్రివర్గంలో అవకాశం దక్కింది. వెనుకబడిన సామాజిక వర్గ కోటాలో కు ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు.
మంత్రి పదవి కోసం జిల్లా నుంచి పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే వెనుకబడిన సామాజికవర్గం కోటాలో శంకర్ నారాయణకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ప్రచారం ముందు నుంచీ సాగింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ వచ్చింది. కుటుంబ సమేతంగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. శంకర నారాయణ ప్రమాణంతో పెనుకొండలోని ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యాకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సంబరంగా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం - ministers
2019-06-08 12:41:56
శంకర నారాయణ మంత్రిగా ప్రమాణం
2019-06-08 12:35:49
మంత్రిగా ప్రమాణం చేసిన అంజాద్ బాషా
అంజాద్ బాషా అల్లా సాక్షిగా మంత్రి పదవికి ప్రమాణం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాకు మంత్రి వర్గంలో మరో బెర్త్ దక్కింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తిగా పేరున్న అంజాద్ బాషాకు అందరూ అనుకున్నట్లే మంత్రి పదవి దక్కింది. అధినేత ప్రకటించిన ఐదు డిప్యూటీ సీఎంల్లో ఒకటి అంజాద్ బాషాకు దక్కింది. దీంతో జిల్లా నేతలు, మైనారిటీ వర్గాల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి.
2019-06-08 12:35:29
గుమ్మనూరు జయరాం మంత్రిగా ప్రమాణం
ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జిల్లా నుంచి రెండో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జయరాం వరసగా రెండోసారి ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతోపాటు బళ్లారి నేతల నుంచి బలమైన అండ ఉండటంతో అనూహ్యంగా మంత్రివర్గం జట్టులోకి జయరాం పేరు వచ్చింది. సామాజిక సమీకరణాలతో జగన్ జట్టులోకి అవకాశం దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన జయరాం... వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేశారు.
2019-06-08 12:34:53
మంత్రిగా ప్రమాణం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో గవర్నర్ ప్రమాణం చేయించారు. వైకాపాలో అగ్రనేతగా, వివాదరహితుడిగా పేరున్న డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఇంజినీరింగ్ లో డిగ్రీ పొందిన బుగ్గన...1996లో సర్పంచిగా ఎన్నికయ్యారు. పదేళ్లు సర్పించిగా పనిచేసిన ఆయన...2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత జగన్ కలిసి నడిచిన ఆయన...2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కీలకమైన పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. 2019 ఎన్నికల్లోనూ తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ పై 35,516 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2019-06-08 12:30:27
కె.నారాయణస్వామి మంత్రిగా ప్రమాణం చేశారు
గవర్నర్ ...కె.నారాయణస్వామి తో మంత్రిగా ప్రమాణం చేయించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన కె.నారాయణస్వామికి సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి లభించింది. రాజకీయ నేపథ్యంతోపాటు కష్టకాలంలో పార్టీని సమర్థంగా నడిపిస్తూ, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన నారాయణస్వామికి పెద్దిరెడ్డితోపాటు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, రోజాతో సత్సంబంధాలున్నాయి. ఆయన ఎంపిక అందరికీ ఆమోదయోగ్యమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సామాజికవర్గం వారు ఎక్కువగా పోటీ పడిన తరుణంలో.. ఎస్సీ కోటా నుంచి నారాయణస్వామికి అవకాశాలు కలిసొచ్చింది.
2019-06-08 12:30:08
మంత్రిగా ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాప నాయకుల్లో తొలి నుంచి జగన్‌తోపాటు కలిసి నడిచిన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ఢి. అధిష్ఠానానికి అన్నీ విషయాల్లో అండగా ఉంటూ... పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించే పూర్తిస్థాయి బాధ్యత తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు వైకాపా ఇన్‌ఛార్జిగా పనిచేశారు. జగన్ పాదయాత్రలోనూ క్రియాశీలంగా వ్యవహరించారు. సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం, తంబళ్లపల్లి నుంచి గెలిచిన ద్వారకానాథ్‌రెడ్డి, జీడీ నెల్లూరు నుంచి గెలిచిన నారాయణస్వామి, పూతలపట్టు విజేత ఎంఎస్ బాబు, మదనపల్లి నుంచి గెల్చిన నవాజ్‌బాషాలకు మార్గదర్శనం చేశారు. స్వయంగా ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా, సోదరుడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమకాలికుడిగా, వైఎస్సార్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.
2019-06-08 12:29:24
మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ప్రమాణం
మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆత్మకూరు నుంచి రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం ఆది నుంచి వైఎస్ తో సన్నిహితంగా ఉంది. వైఎస్ మరణం తర్వాత వైకాపా ఆవిర్భావం సమయంలో జగన్ కు అండగా నిలిచారు. జగన్ కు నమ్మిన నేతలుగా మేకపాటి కుటుంబానికి గుర్తింపు ఉంది. జిల్లాలో అత్యంత సీనియర్ నేతలు ఉన్నప్పటికీ జగన్...గౌతంరెడ్డికే అవకాశం కల్పించారు.
2019-06-08 12:28:57
మంత్రిగా ప్రమాణం చేసిన అనిల్‌కుమార్ యాదవ్
అనిల్‌కుమార్ యాదవ్ తో గవర్నర్ ప్రమాణం చేయించారు. నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. జిల్లా నుంచి మంత్రి హోదా దక్కించుకున్న ఇద్దరూ ఎమ్మెల్యేలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనిల్ తెలుగులో ప్రమాణం చేయగా... మేకపాటి గౌతం రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
2019-06-08 12:28:16
ఆదిమూలపు సురేష్ మంత్రిగా ప్రమాణం
ఆదిమూలపు సురేష్‌తో గవర్నర్ ప్రమాణం చేయించారు. పార్టీ పట్ల విధేయుడిగా, పార్టీ వాదనను సమర్థంగా వినిపించిన మరో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్. వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో యర్రగొండపాలెం నుంచి, 2014లో సంతనూతలపాడు నుంచి, 2019 ఎన్నికల్లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి విజయం సాధించారు. 2014లో గెలిచిన తర్వాత జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా సురేష్ వెళ్లలేదు. వైకాపాకు విధేయుడిగా ఉంటూ అటు శాసనసభలోనూ, ఇటు జిల్లా సమావేశాల సందర్భంగానూ తన గళం విప్పేవారు. 2014లో సంతనూతలపాడు నుంచి గెలిచిన తర్వాత ఇక్కడ పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే యర్రగొండపాలెం కూడా తనదేనని భావించారు. కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు. ఉన్నత విద్యావంతుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. మంత్రివర్గంలో సురేష్ చేరిక విషయమై శుక్రవారం ఉత్కంఠ పరిణామాలు ఎదురయ్యాయి. ఒకే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి మంత్రులుగా చోటు కల్పించడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీలోనూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నానికే చాలా మందికి ఫోన్లు వచ్చినప్పటికీ సురేష్‌కు రాకపోవడంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. కానీ శుక్రవారం సాయంత్రం ఆయన పేరు ఖరారు చేసి, ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరడంతో ఆయన వర్గీయులు, సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు.
2019-06-08 12:26:42
మంత్రిగా ప్రమాణం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
బాలినేని శ్రీనివాసరెడ్డితో గవర్నర్ ప్రమాణం చేయించారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే బాలినేని. 1999 నుంచి 2014 వరకు (2012 ఉప ఎన్నికతో కలిపి) అయిదు ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు సార్లు గెలుపొందారు. వైకాపా అంటే జిల్లాలో మొదట గుర్తుకు వచ్చే పేరు ఈయనదే. అటు పశ్చిమాన, ఇటు తూర్పున కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయనంటే అభిమానమే. వైకాపా ఆవిర్భావం నుంచి జిల్లాలో ఈయన కీలకంగా పనిచేశారు. నాడు మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని వదులుకుని జగన్‌తో జత కట్టి 2012లో ఉప ఎన్నికలకు వెళ్లి గెలుపొందారు. 2014లో ఎన్నికలకు ముందు టిక్కెట్ల కేటాయింపు మొదలు అన్ని విషయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కాస్త దూరమైనప్పటికీ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకున్నారు. గత ఏడాది జిల్లాలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నుంచి బాలినేని కూడా జిల్లాలో చురుకయ్యారు. తన వెంట వచ్చే వారిని కలుపుకొంటూ, తన పాత వర్గీయులను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు వెళ్లారు. భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
2019-06-08 12:25:48
మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ప్రమాణం
మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ప్రమాణం చేశారు. గుంటూరు జిల్లాలో వైకాపా సీనియర్ నేతగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావుకు మంత్రివర్గంలో స్థానం లభించింది. తొలి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన వైకాపా తరపున 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉండడం, ఆపై మత్స్యకార కుటుంబానికి చెందడంతో మంత్రివర్గంలో చోటు దక్కింది.గతంలో మూడు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవం కూడా కలిసొచ్చింది. డెల్టా ప్రాంతంలో కీలకమైన నేతగా ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందారు.
2019-06-08 12:23:14
మంత్రిగా ప్రమాణం చేసిన మేకతోటి సుచరిత
మేకతోటి సుచరితతో గవర్నర్ ప్రమాణం చేయించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పునాదులు పడ్డ గుంటూరు జిల్లాకు మంత్రి మండలిలో రెండు స్థానాలు దక్కాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత, రేపల్లెలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరణరావుకు సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరితో సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
2019-06-08 12:18:04
మంత్రిగా ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్
వెల్లంపల్లి శ్రీనివాస్ తో గవర్నర్ ప్రమాణం చేయించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి వరించింది. రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ముగ్గురు శాసనసభ్యులు గెలుపొందారు. సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రివర్గంలో బెర్త్ లభించింది.2009లో ప్రరాపా తరఫున పోటీ చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికాబేగంపై విజయం సాధించారు. ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. నాడు తెదేపా మద్దతుతో పశ్చిమ నియోజకవర్గం భాజపాకు కేటాయించారు. దీంతో వెలంపల్లి భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓడిపోయారు. వైకాపా నుంచి పోటీ చేసిన జలీల్‌ఖాన్ గెలుపొందారు. జలీల్‌ఖాన్ వైకాపా వీడి సైకిల్ ఎక్కడంతో వెలంపల్లి వైకాపాలోకి చేరిపోయారు. 2019 టిక్కెట్ సాధించి విజయం సాధించారు.
2019-06-08 12:16:25
మంత్రిగా ప్రమాణం చేసిన పేర్ని నాని
మంత్రిగా ప్రమాణం చేశారు పేర్ని నాని...బందరు అసెంబ్లీ స్థానం గెలిచిన పేర్ని వెంకట్రామయ్య(నాని)కు రాజకీయ వారసత్వం కలిసి వచ్చింది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వహించిన ఆయన...వైఎస్సార్ ను బాగా అభిమానించే నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉంది. 1994,2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ తో ఉన్నారు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ...ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు.
2019-06-08 12:14:20
మంత్రిగా ప్రమాణం చేసిన కొడాలి నాని
కొడాలి నానితో గవర్నర్ ప్రమాణం చేయించారు.
పార్టీకి విధేయతో పాటు సామాజిక సమీకరణల్లో సమతూకం పాటిస్తూ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు సీఎం జగన్. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన కొడాలి నాని పార్టీలో దూకుడూగా వ్యవహరించారనే పేరుంది. వైఎస్ జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతగా నానికి గుర్తింపు ఉంది. తెదేపా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని...జగన్‌తో ఉన్న సానిహిత్యంతో వైకాపాలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో, శాసనసభలోనూ చురుకుగా వ్యవహారించారు. దీనికి తోడు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.
2019-06-08 12:12:54
మంత్రిగా ప్రమాణం చేసిన తానేటి వనిత
తానేటి వనితతో ప్రమాణం చేయించిన గవర్నర్....కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనితకు జగన్‌జట్టులో అవకాశం ఉంటుందని మొదటి నుంచీ వినిపించింది. 2009లో గోపాలపురం నియోజకవర్గం నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు. 2014లో జవహర్‌పై పోటీ చేసి ఓటమి చెందిన వనిత నియోజకవర్గంలో ఉంటూ ఐదేళ్లు పోరాటమే చేశారు. ఎస్సీ కావడం, మహిళ కోటాలో ఆమెకు మంత్రి వర్గంలో స్థానం దక్కింది.
2019-06-08 12:08:22
మంత్రిగా ప్రమాణం చేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు
చెరుకువాడ శ్రీరంగనాథరాజు తో గవర్నర్ ప్రమాణం చేయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులకంటే సీనియరు నాయకుడు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ రంగనాథరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణపై పోటీ చేసివిజయం సాధించారు. అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యం పాటించడంలో భాగంగా ఈయనకు అవకాశం దక్కినట్లు చెబుతున్నారు.
2019-06-08 12:06:40
మంత్రిగా ఆళ్ల నాని ప్రమాణం
ఆళ్ల నాని మంత్రిగా ప్రమాణం చేశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల నాని... వైఎస్ కుటుంబానికి అనుచరుడిగా పేరుంది. గతంలో వైఎస్ రాలేక పోతున్నారని పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేసుకున్న నాని ఆ తరువాత ఆయన సమక్షంలో వివాహం చేసుకుని ఆయనకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఏడేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇవన్నీ మంత్రివర్గంలో చోటుకు కలిసివచ్చాయి.
2019-06-08 12:05:18
మంత్రిగా ప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్
పినిపే విశ్వరూప్ మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు.
అమలాపురం ఎమ్మెల్యే విజేత పినిపే విశ్వరూప్ బీఎస్సీ, బీఈడీ వరకు చదివారు. 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉపఎన్నికలు, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యేగా.. 2009లో అమలాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2010 వరకు రాష్ట్ర గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా. 2010 నుంచి 2013 వరకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ, వెటర్నరీ విశ్వవిద్యాలయ, మత్స్య శాఖ మంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిలపై అభిమానంతో ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైకాపా అభివృద్ధికి కృషిచేసి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యే విజేతగా నిలిచారు. పార్టీపై వైఎస్ కుటుంబంపై విధేయతను గుర్తించిన వై.ఎస్.జగన్ మరోసారి మంత్రిగా పనిచేసే అవకాశాన్ని విశ్వరూప్‌కు కల్పించారు.
2019-06-08 12:02:33
మంత్రిగా ప్రమాణం చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్
పిల్లి సుభాష్ చంద్రబోస్ తో గవర్నర్ ప్రమాణం చేయించారు.
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజా ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈయన స్వగ్రామం రామచంద్రపురం మండలం హసన్‌బాద. బీఎస్సీ చదివిన ఈయన 1978లో జిల్లా పరిషత్తు కోఆప్షన్ సభ్యునిగా తొలి రాజకీయ పదవి చేపట్టారు. 1985, 1994, 1999లలో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1989, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2006 నుంచి 2009 వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. 2009 ఎన్నికల్లో విజయం సాధించి 2009 నుంచి 2010 వరకు మంత్రిగా కొనసాగారు. 2012లో రామచంద్రపురం నుంచి ఉప ఎన్నికల్లో వైకాపా తరపున పోటీచేసి ఓడిపోయారు. 2014లో వైకాపా తరపున రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉండడంతో వైకాపా నుంచి పోటీచేసిన మూడోసారీ ఓటమి పాలైనా ఓసారి ఎమ్మెల్సీగా..ఇప్పుడు మంత్రిగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్.
2019-06-08 11:59:47
మంత్రిగా కురసాల కన్నబాబు ప్రమాణం
కురసాల కన్నబాబుతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే విజేత కురసాల కన్నబాబు బీకాం, ఎంఏ చదివారు. ఈయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ. పాత్రికేయుడిగా పనిచేసిన అనంతరం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో సినీనటుడు చిరంజీవి కోరిక మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కాంగ్రెస్ శాసనసభ్యుడిగా కొనసాగారు. 2014లో కాకినాడ గ్రామీణం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైకాపాలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జగన్ జట్టుతో కన్నబాబుకు అవకాశం దక్కింది. కన్నబాబుకు మంత్రి పదవి దక్కడంతో ఓసీలకు జిల్లా నుంచి ప్రాధాన్యం ఇచ్చినట్లైంది.
2019-06-08 11:57:40
మంత్రిగా ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాస్
విశాఖ జిల్లా నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు...2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.సామాన్య జనంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారన్న పేరు తెచ్చుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులందరితోనూ స్నేహంగా ఉండేవారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా, వివాదాల్లో చిక్కుకోకుండా నెగ్గుకురాగలిగారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనపుడు ఈయన కూడా హస్తం పార్టీలో చేరారు. ఆ తరువాత తన సన్నిహిత మిత్రుడు గంటా శ్రీనివాసరావుతో కలిసి తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత తెదేపా ను చివరి నిమిషంలో వీడిన ఆయన..వైకాపాలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ముత్తంశెట్టితో కలిపి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల్లో అయిదుగురు మంత్రులుగా చేసినట్లయింది.
2019-06-08 11:54:54
పాముల పుష్ప శ్రీవాణి ప్రమాణం
పాముల పుష్ప శ్రీవాణితో గవర్నర్ ప్రమాణం చేయించారు. విజయనగరం జిల్లా ఆవిర్భావం నుంచి మంత్రి పదవి లభించని ఒకే ఒక్క నియోజకవర్గం కురుపాం. తాజాగా అక్కడ నుంచి విజయం సాధించిన పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి ఇవ్వడంలో ఆ లోటు తీరిపోయింది. పుష్పశ్రీవాణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. ఆమె 10వ తరగతి వరకూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. జంగారెడ్డిగూడెంలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. విశాఖలో బీఈడీ పూర్తిచేసి తాను చదివిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. .
2019-06-08 11:52:33
బొత్స సత్సనారాయణ మంత్రిగా ప్రమాణం
బొత్స సత్సనారాయణతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్...
2004 నుంచి చీపురుపల్లిలో గెలుపొందిన నేతకు మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి బొత్సకు మంత్రిత్వ పదవితో అదే పునరావృతమైంది.2004, 2009లల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో గెలుపొందడమే కాకుండా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రవాణాశాఖ, గృహనిర్మాణశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రిగాను ఆయన పనిచేశారు.2012 నుంచి 2015 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా జోడు పదవుల్లో కొనసాగిన ఏకైక నేతగా సైతం బొత్స గుర్తింపు పొందారు. 2017లో కాంగ్రెస్ నుంచి వైకాపాలో చేరారు. అయిదేళ్ల పాటు అధికారానికి దూరమైనా తన వర్గం నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజల్లోను పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని నిలుపుకోగలిగారు. దీంతో తాజాగా 2019 ఎన్నికల్లో గెలుపొంది మళ్లీ అయిదేళ్ల తరువాత మంత్రి పదవిని చేపట్టబోతున్నారు.
2019-06-08 11:46:55
ధర్మాన కృష్ణదాస్ తో ప్రమాణం చేయించిన గవర్నర్
రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయ ప్రాంగణంలో మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయిస్తున్నారు. సిక్కోలు జిల్లా నుంచి జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్...ఆయనతో ప్రమాణం చేయించారు.

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీతారాంపురం మండలానికి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు తోలుకొని వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రమాదంలో లో 40 గొర్రెల వరకు చనిపోయాయి సీతారాంపురం మండలానికి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు సుమారు వెయ్యి గొర్రెలతో నెలల క్రితం వారి గ్రామాల్లో నీరు మేత లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం కనిగిరి రిజర్వాయర్ వద్దకు వలస వెళ్లారు రెండు ఎలా ఉంది అక్కడే గొర్రెలను మేపు కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు వాతావరణ సమీపంలో మారుతుండడంతో తన అ సొంత మండలమైన సీతారామపురం కి కి తిరుగు ప్రయాణమయ్యారు ఆత్మకూరు మండలం వాసులు వద్ద తెల్లవారుజామున గుర్తుతెలియని మ్యాజిక్ వాహనం ఢీకొని 5 గొర్రెలు చనిపోగా ఇంకా దూరంలో లో నెల్లూరు పాలెం సమీపంలో లో గుర్తు తెలియని లారీ ఢీకొని 35 గొర్రెలు చనిపోయాయి బతుకు తెరువు కోసం ఇలా రావడంతో అప్పు చేసి మరీ గొర్రెలను కొనుగోలు చేసామని లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోయారు
Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు