ఎన్నికల కోడ్ ఉన్నపుడు ప్రభుత్వం సాధారణ పరిపాలన అందిచొచ్చని మంత్రి సోమిరెడ్డి అన్నారు. కరవు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సమీక్షలకు అనుమతించాలని అమరావతిలో పేర్కొన్నారు. అలా చేయవద్దని చట్టంలో ఉందా అని ప్రశ్నించారు.
'పకృతి వైపరీత్యాల సమయాల్లో సమీక్షలకు ఈసీ అనుమతివ్వాలి. అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సాగు విధానాలను రైతులకు వివరించాలి. ఇలా సమీక్షలు చేయవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా. తెలంగాణకు ఓ చట్టం..ఏపీకి ఓ చట్టమా..?. సీఎం సమీక్షంటే అధికారులు భయపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని వైకాపా చూస్తోంది. కోడ్ పేరుతో ప్రజాప్రయోజనాలు అడ్డుకుంటే మేమెందుకు..! ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సాధారణ పరిపాలన అందించొచ్చు'.
--- అమరావతి మీడియా సమావేశంలో మంత్రి సోమిరెడ్డి
ఇవీ చదవండి....'వారిది మాటల ప్రభుత్వం- మాది చేతల సర్కార్'