సామాజిక మాధ్యమాల్లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని కొందరు తన పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని... తన గురించి సదరు వ్యక్తులపై వ్యాఖ్యానించడానికి వారికి ఏ అధికారం ఉందని ఆమె ప్రశ్నించారు. పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పూనమ్ కౌర్ విన్నవించారు.
ఇవీ చూడండి:మరో సినిమాకు కల్యాణి గ్రీన్ సిగ్నల్..?