ETV Bharat / briefs

రూ.2.50కి వచ్చే సరుకులేంటి?... సిల్వర్‌జూబ్లీ కళాశాల విద్యార్థుల ప్రశ్న - students

విద్యా ప్రమాణాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సొంతం చేసుకున్న కళాశాలలో వసతి, భోజనం కోసం విద్యార్థులు పోరాడుతున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది ఉన్నతాధికారులను అందించిన విద్యాసంస్థ... ఓ శాఖ తీసుకున్న నిర్ణయంతో అబాసుపాలవుతోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేమని చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పునరాలోచించుకోవాలని ప్రభుత్వాని వేడుకుంటోంది.

midday meals
author img

By

Published : Jul 4, 2019, 7:19 AM IST

కళాశాలలో వసతి, భోజనం కోసం విద్యార్థుల పోరాటం

విద్యా ప్రమాణాల్లో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 వేల మంది చదువుకుంటున్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఏటా 280 మందికి ప్రవేశాలు కల్పిస్తోందీ విద్యాసంస్థ. మంచి వసతి, భోజనం సదుపాయం కల్పించింది. వేళకి తిని ప్రశాంతంగా చదువుపై దృష్టి పెడుతున్నందున దేశంలో ఉన్నత స్థానం పొందిందీ కళాశాల. ఇటీవల పౌరసరఫరాల శాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో విద్యార్థులు కడుపుమాడ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

విద్యార్థులకు అల్పాహారం, 2పూటలా భోజనం అందిస్తోంది. విద్యార్థికి రోజూ వచ్చే 35 రూపాయల డైట్‌ ఛార్జీలతోనే బియ్యం సహా అన్ని సరకులూ కొనుగోలు చేస్తుంటారు. వసతిగృహం ప్రారంభం నుంచి 15 రూపాయలకే కిలో బియ్యం సరఫరా చేసేది పౌరసరఫరాల శాఖ. గతంలో కర్నూలులో కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ లేఖతో... 2017 అక్టోబర్‌ నుంచి రూపాయికే అందిస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం రాకతో నిబంధనలు మార్చిసింది పౌరసరఫరాల శాఖ. పాత ధరకు బియ్యం ఇవ్వలేమని కిలో బియ్యానికీ 32 రూపాయల 50 పైసలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చిన 35 రూపాయల్లో... 32 రూపాయల 50 పైసలు బియ్యానికే చెల్లిస్తే మిగిలిన 2 రూపాయల 50 పైసలతో ఇతర సరకులు ఎలా కొనుగోలు చేయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

కళాశాల వసతి గృహంలోని విద్యార్థులకు ప్రతి నెలా 110 క్వింటాళ్ల బియ్యం అవసరం. కిలో రూపాయి చొప్పున 11 వేలకే బియ్యం అందేవి. కొత్త ఉత్తర్వుల ప్రకారం నెలకు 3 లక్షల 57 వేలు ఖర్చు పెట్టాలి. అంటే ఏడాదికి 42 లక్షల 90 వేల రూపాయలు బియ్యానికే కేటాయించాలి. కూరగాయలకు ప్రతి నెలా లక్షా 50 వేలు, గుడ్లు 50 వేలు, పాలు 80 వేలు, గ్యాస్‌కు లక్ష, చికెన్ కు 50 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది వరకే కొన్న బియ్యం ఈ నెల 14 వరకే సరిపోతాయని, తరువాత హాస్టల్‌ నిర్వహణ కష్టమవుతుందని అధ్యాపకులు చెబుతున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు ఇస్తున్న ప్రాతిపదికనే సిల్వర్ జూబ్లీ కళాశాలకు బియ్యం సరఫరా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఊసావానిపేట యూత్ ఆధ్వర్యంలో కృష్ణాపురం నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండ తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచార సంఘటన నిరసనగా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తారక్ సాయి అఖిల్ తేజ అ సాయి కిరణ్ కుర్మా రావ్ శ్యామల తో పాటు ఆమదాలవలస ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని నిరసన తెలియజేశారు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అ నిరసన చేపట్టారు.8008574248.

Body:ఆముదాలవలస లో నిరసన ర్యాలీ

Conclusion:8008574248

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.