బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడురాష్ట్రానికి రానున్నారు. జనసేన, వామపక్షాలతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇవాళరాత్రికి విశాఖపట్నం చేరుకోనున్న ఆమె... ఈ నెల3నపవన్ కల్యాణ్ తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడతారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ మాకినేని బసవపున్నయ్య మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. 4న తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించే సభలో ప్రసగిస్తారు అదేరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న మాయావతి... ఎల్బీ స్టేడియంలో సభకు హాజరవుతారు. తెలంగాణాలో లోక్సభ ఎన్నికలకు పోటీలో ఉన్న జనసేన, బీఎస్పీ అభ్యర్థుల తరఫున పవన్ తో కలిసి అక్కడప్రచారం చేస్తారు.
నేడు రాష్ట్రానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి రాక - మాయావతి
రాష్ట్రంలో జనసేన, బీఎస్పీ కూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు.