ETV Bharat / briefs

'150 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు మాదే' - ysrcp

సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అత్యధిక స్థానాలు కైవసం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించగా...ఇంకా 140కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. పార్టీ అనుహ్య విజయంతో వైకాపా నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ నేతలందరూ జగన్ నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : May 23, 2019, 2:21 PM IST

వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి
వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి

వైకాపా నేత విజయసాయిరెడ్డి, జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, పలువురు పార్టీ నేతలు తాడేపల్లి జగన్ నివాసానికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ఖాయంగా కనిపించడం వలన ఈ నెల 25న శాసన సభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వైకాపా నిర్ణయించింది. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తుంది. వైకాపా శాసన సభాపక్ష నేతగా వైఎస్ జగన్​ను...పార్టీ ఎమ్మెల్యేలు ఈ నెల 25న ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.

26న గవర్నర్​ను కలిసే అవకాశాలున్నాయని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 30న రాజధాని ప్రాంతంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయం సహా విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. రాజన్న పాలనను జగన్ తిరిగి అందించనున్నారని వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి...రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసే వారికే మద్దతిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Ludhiana (Punjab), May 22 (ANI): The preparation of 'laddu' is on full swing ahead of the counting day of Lok Sabha Elections 2019. Several sweet shops have been ordered to prepare 'laddu' in abundance in Punjab's Ludhiana ahead of the elections result. Party workers and supporters of Congress, Bharatiya Janata Party (BJP) and Shiromani Akali Dal (SAD) are excited before the results will be announced. While speaking to ANI, President of the Punjab Halwai Association Narinder Pal Singh said, "We have received orders mainly from two political parties i.e, BJP-SAD and Congress. Around 10 to 12 quintals of orders we have received by now from both the parties. The orders have been coming in right after the exit polls." The Lok Sabha elections were held in seven phases across the nation. The results of the polls will be declared on May 23.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.