గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి తనపై ఎమ్మెల్యేగా గెలిచిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. నామినేషన్ వేసిన నుంచీ కౌంటింగ్ వరకూ అహర్నిశలు తెదేపా విజయం కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ఎన్నికలలో పోటీచేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి రాష్ట్ర ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ... మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు.
-
శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019
-
గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ @narendramodi , శ్రీ @ysjagan లకు శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ @narendramodi , శ్రీ @ysjagan లకు శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ @narendramodi , శ్రీ @ysjagan లకు శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) 23 May 2019