ఈ మార్స్ యాత్రలో సామాన్యులను భాగం చేయాలనే ఉద్దేశంతో ఓ అవకాశాన్ని కల్పించింది. నాసా వెబ్సైట్లో లాగిన్ అయి మార్స్ రోవర్ ప్రయాణానికి సంబంధించిన లింక్‌లో తమ పేరు, దేశం తదితర వివరాలు నమోదు చేసుకుంటే...వారి పేర్లతో కూడిన ఓ చిప్‌ను అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేలా తగిన ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఓ ప్రత్యేక వెబ్‌లింక్‌ను అందుబాటులో ఉంచింది. నాసా చేపడుతున్న ప్రయోగాలు ప్రజలకు చేరువయ్యేలా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రయాణానికి కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరెటరీలోని మైక్రో డివైజ్ విభాగం తగిన ఏర్పాట్లను చేస్తోంది. వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకున్న సుమారు 20 లక్షల మంది పౌరుల వివరాలను...75 నానోమీటర్ల పరిమాణ అక్షరాల రూపంలో ఎలక్ట్రాన్ బీమ్‌ను ఉపయోగించి చిప్‌లో భద్రపరిచి వాటిని మార్స్ రోవర్‌కు అనుసంధానిస్తారు.
మొత్తం 1000 కిలోల బరువుండే ఈ రోబో రోవర్...జూలై 2020లో తన ప్రయాణం ప్రారంభించి...ఏడు నెలల పాటు ప్రయాణించి 2021 ఫిబ్రవరి నాటికి అంగారుకునిపై అడుగుపెట్టనుంది. మానవాళి నివాసానికి అనువైన పరిస్థితులు అంగారకునిపై ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు నాసా ఈ ప్రయోగం తలపెట్టింది.
ఇవీ చూడండి : చాయ్‌వాలా సంబరం... ఉచిత టీ, మటన్ విందు